Chandrababai Naidu : సునామీ తప్పదంటూ .. వైసీపీ నేతలకు చంద్రబాబు ఆఫర్..

వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోందని..ఇక సునామీ ఖాయం అని ఇక త్వరలోనే వైసీపీ నేతలు తట్టాబుట్టా సర్ధుకుని జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారని అన్నారు చంద్రబాబు.

Chandrababai Naidu : సునామీ తప్పదంటూ .. వైసీపీ నేతలకు చంద్రబాబు ఆఫర్..

Chandrababu's offer to YCP leaders

Chandrababai Naidu : వైసీపీ అధినేత జగన్ ఈసారి 175కు 175 సీట్లు గెలుస్తామని..గెలిచేలా కృషి చేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలకు ఆదేశిస్తున్నారు. మరోపక్క వైసీపీ నేతలల్లోనే ఒకరిపై మరొకరికి పడటంలేదు. ఆయా నియోజకవర్గాల్లో అంతర్యుద్ధాలు బయటపడుతున్నాయి. బహిరంగంగానే వైసీపీ నేతలు విమర్శలు చేసుకోవటం జరుగుతోంది. వైసీపీలో ఉన్న ఈ పరిస్థితిపై మాజీ సీఎం టీడీపీ అధినేత ఫోకస్ పెట్టారు. వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోందని..ఇక సునామీ ఖాయం అని ఇక త్వరలోనే వైసీపీ నేతలు తట్టాబుట్టా సర్ధుకుని జంప్ అవ్వటానికి రెడీగా ఉన్నారని అన్నారు చంద్రబాబు.

అటువంటి వైసీపీ నేతలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. వైసీపీలో ఉన్నా మంచివారిగా ఉండే నాయకులు వస్తే టీడీపీలో చేర్చుకుంటామంటూ ఆపరేషన్ టీడీపీ మొదలు పెట్టారు. ఎన్నికలు వస్తున్నాయంటూ జంప్ జిలానీలు ‘జంపింగ్’లు షురూ చేస్తారనే విషయం తెలిసిందే. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి తక్కెట్లో కప్పల్లా గెంతుతుంటారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని దానికికారణం జగన్ తీరు..ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతేనని అంటున్నారు విపక్షాలు.

తమ సొంతప్రభుత్వంపైనే తీవ్ర వ్యతిరేకత ఉన్నా పార్టీలో కొనసాగుతూనే కొంతమంది నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అధిష్టానం వేధింపులకు భయపడి నోరు మెదపటంలేదని త్వరలోనే వారంత బయటకు వస్తారని అటువంటి నేతలు నిజంగా ప్రజాసేవ చేయాలనుకునే నేతలను తన పార్టీలో చేర్చుకుంటానని ప్రకటించారు చంద్రబాబు. ప్రజాసేవ చేయాలనుకునేవారిని పార్టీలోకి తీసుకంటే తప్పులేదంటున్నారు చంద్రబాబు.

వైసీపీపై వస్తున్న వ్యతిరేకతతో జగన్ కు ఓటమి భయం పట్టుకుందని కానీ కొంతమంది నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యంతో విమర్శలు చేస్తున్నారని కానీ ప్రస్తుత పరిస్థితి వారికి కూడా అర్థమవుతోందని నా సభలకు వస్తున్న భారీ స్పందన చూసి వైసీపీ ఓర్వలేకపోతోందని ఇక వైసీపీ పతనం తప్పదని రానున్న ఎన్నికలల్లో ప్రజలు దానికి సమాధానం చెబుతారని అన్నారు చంద్రబాబు. వైసీపీలో అంతర్యుద్ధం జరుగుతోందని ప్రస్తుతం నా సభలకు వచ్చే ప్రజలు కేవలం శాంపిల్ మాత్రమేనని వచ్చే రోజుల్లో సునామీలా వస్తారని అలాగే వైసీపీ నుంచి కూడా నాయకులు సునామీలా బయటకు వస్తారని అన్నారు.