Muslim American : అమెరికాలో చరిత్రలో తొలిసారి..ఫెడరల్ జడ్జిగా ముస్లిం వ్యక్తి

అమెరికాలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నియమితులయ్యారు.

Muslim American : అమెరికాలో చరిత్రలో తొలిసారి..ఫెడరల్ జడ్జిగా ముస్లిం వ్యక్తి

U S Senate Confirms First Muslim American As Federal Judge

Muslim American అమెరికాలో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముస్లిం అమెరికన్ ఫెడరల్ జడ్జిగా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ముస్లిం అమెరికన్ జాహిద్ ఖురేషిని న్యూ‌జెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా కొద్ది రోజుల క్రితం నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్ సెనేట్ బైడెన్ నిర్ణయానికి తాజాగా మద్ధతు తెలిపింది.

న్యూ‌జెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జాహిద్ ఎన్‌ ఖురేషి(46) నియామకానికి గురువారం యూఎస్ సెనేట్ 81-16 ఓట్ల‌తో ఆమోదం తెలిపింది. ఖురేషి నియామకంలో డెమొక్రాట్ల‌తో రిప‌బ్లిక‌న్లు చేతులు క‌ల‌ప‌డం విశేషం. ఖురేషి నియామకానికి మద్దతు తెలిపిన వారిలో 34 మంది రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్లు కూడా ఉన్నారు. ఖురేషి తన పదవీకాలమంతా దేశానికి సేవ చేయ‌డంలో గ‌డిపార‌ని సెనేట్‌లో ఓటు వేయడానికి ముందు సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ సెనేటర్ రాబర్ట్ మెండెజ్ చెప్పారు. మెరుగైన జీవితం కోసం తన తల్లిదండ్రులు పాకిస్తాన్ నుంచి వలసదారులుగా ఇక్కడకు వచ్చారని మెండెజ్ తెలిపారు.

ఖురేషి న్యాయమూర్తిగా నియమించడానికి ముందు అతను రైకర్ డాన్జాంగ్ వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ గ్రూపు అధికారిగా సేవ‌లందించారు. ర‌ట్జ‌ర్ లా కాలేజీ నుంచి న్యాయ‌ప‌ట్టా పొందిన‌ జాహిద్ ఖురేషి 2019 లో న్యూజెర్సీ జిల్లా కోర్టులో మెజిస్ట్రేట్ జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు.