UAE Ship : ఇరాన్ సమీపంలో మునిగిపోయిన UAE కార్గో షిప్..ఓడలో 30 మంది సిబ్బంది
UAE కార్గో షిప్ ఇరాన్‌లోని అస్సలుయెహ్ నౌకాశ్రయానికి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఓడలో 30 మంది సిబ్బంది ఉన్నారు.

Uae Cargo Ship With 30 Crew Members On Board Sinks 30 Miles Off Coast From Iran
UAE Ship : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి చెందిన కార్గో షిప్, ఇరాన్‌లోని అస్సలుయెహ్ నౌకాశ్రయానికి సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ఇరాన్ పోర్ట్ అస్సలుయేకు 30 మైళ్ల దూరంలో ‘అల్ సాల్మీ 6’ సరుకు రవాణా నౌక మునిగినట్లు సేలం అల్ మక్రానీ కార్గో కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ కెప్టెన్ నిజార్ ఖద్దౌరా నిర్ధారించారు. మునిగిపోయిన షిప్ లో 30 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. అందులో 16 మందిని రెస్క్యూ టీం కాపాడారని..మరో 11మంది లైఫ్ బోట్‌లో సరక్షితంగా ఉన్నారని తెలిపారు. షిప్ మునిగిపోయిన ఘటనలో సముద్రం నుంచి ఒకరిని రక్షించగా, మరో ఇద్దరు ఇంకా నీటిలో ఉన్నారని తెలిపారు.
సముద్రంపై తేలుతున్న కార్గో షిప్ సిబ్బందిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోందని తెలిపింది. షిప్ సిబ్బంది అంతా లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారని..బలమైన గాలులకు లైఫ్ బోటుతోపాటు సముద్రంలో ఉన్న ఇద్దరిని చేరుకోవడం కష్టంగా ఉన్నదని ఇరాన్ సెమీ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలిపింది.