UAE Flight Services: ఇండియా విమానాలకు జులై 6వరకూ నో ఎంట్రీ

అంతర్జాతీయ ప్రయాణికులు.. యూఏఈకి వెళ్లాలనుకుంటుున్న వారికి అప్‌డేట్. ఇండియా నుంచి వచ్చే వాహనాలకు జులై 6వరకూ ఎంట్రీ లేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జులై 6వరకూ ఇండియా - యూఏఈల ...

UAE Flight Services: ఇండియా విమానాలకు జులై 6వరకూ నో ఎంట్రీ

Uae Flight Services

UAE Flight Services: అంతర్జాతీయ ప్రయాణికులు.. యూఏఈకి వెళ్లాలనుకుంటుున్న వారికి అప్‌డేట్. ఇండియా నుంచి వచ్చే వాహనాలకు జులై 6వరకూ ఎంట్రీ లేదని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. జులై 6వరకూ ఇండియా – యూఏఈల మధ్య రాకపోకలను రద్దు చేసింది.

ఏదేమైనా జులై6 వరకూ సస్పెండ్ పొడిగించారు కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకున్న టిక్కెట్ల షెడ్యూల్ ను మార్చుకోవచ్చు. యూఏఈ ప్రధానంగా నడిపే విమాన సర్వీసులు UAE carriers, Emirates, Etihadలు తమ సస్పెన్షన్ పొడిగింపును ప్రకటించాల్సి ఉన్నాయి.

యూఏఈకి వెళ్లాలనుకునేవారికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ట్రావెల్ అప్‌డేట్ ఏంటంటే.. ‘జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, యూఏఈ ప్యాసింజర్ల కదలికలను నియంత్రించేందుకు యూఏఈకి ఇండియా నుంచి వచ్చే విమానాలను 2021 జులై 6వరకూ నిలిపేశారని పేర్కొంది.

ముందుగా దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్ మే30న జూన్ 30వరకూ విమానాల సస్పెన్షన్ ఉంటుందని ప్రకటించాయి.