Uganda : మంత్రిని కాల్చి చంపిన సైనికుడు .. ఎందుకంటే..

కేంద్రమంత్రికి సెక్యురిటీగా ఉన్న సైనికుడు మంత్రినే కాల్చి చంపాడు. మంత్రి నివాసంలోనే కాల్చి చంపిన ఘటన దేశంలో పెను సంచలన కలిగించింది.

Uganda : మంత్రిని కాల్చి చంపిన సైనికుడు .. ఎందుకంటే..

Uganda soldier Asasineted the minister

Uganda : ఉగాండాలో ఒక సైనికుడు మంత్రిని కాల్చి చంపాడు.ఆ తరువాత తనకు తానే కాల్చకుని చనిపోయాడు. మంగళవారం (మే2,2023) ఉదయం కార్మిక శాఖ సహాయ మంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఒకెల్లో ఎంగోలాకు సెక్యూరిటీగా ఉన్న సైనికుడే అతనిని కాల్చి చంపి ఆ తరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉగాండా రాజధాని కంపాలాలోని మంత్రి నివాసంలో విల్సన్ సబిజిత్ అనే సైనికుడు మంత్రి చార్లెస్ ఒకెల్లోని కాల్చి చంపిన ఘటన చోటుచేసుకుంది.

సబిజిత్‌ అనే సైనికుడిని ఓ నెల రోజుల క్రితం మంత్రి చార్లెస్ కు సెక్యూరిటీగా నియమించారు. మరి వీరిద్దరి మధ్యా ఏం జరిగిందో తెలియదుగానీ సబిజిత్ మంగళవారం ఉదయం మంత్రి నివాసంలో ఉండగానే కాల్చి చంపాడు. ఆ తరువాత కొన్ని రౌండ్ల గాల్లోకి కాల్చి ఆ తరువాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడు. సబిజిత్ జరిపిన కాల్పుల్లో మంత్రి సహాయకులుగా ఉన్నవారిలో ఒక వ్యక్తి మరణించారు. ఇద్దరి మధ్యా వాదన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరి సబిజిత్ మంత్రిని ఎందుకు కాల్చాడో..తాను ఎందుకు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు.

సబిజిత్ మంత్రిని కాల్చాక తనను తాను కాల్చుకోవడానికి ముందు అదే ప్రదేశంలో కాసేపు అటూ ఇటూ తిరిగాడని ఆ తరువాత గాల్లోకి కాల్పులు జరిపి తనను తాను కాల్చకున్నాడని చూసినవారు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో రొనాల్డో ఒటిమ్ అనే మంత్రి సహాయకుడితో పాటు పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన మంత్రి సహాయకుడు రోనాల్డో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు. ఈ ఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీగా జనాలుగుమిగూడారు.ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా..తనకు జీతంగా రావాల్సిన 4 మిలియన్ల రూపాయలు చెల్లించలేదని..తనకు గర్భవతి అయిన భార్య ఉందని, తన పిల్లలు స్కూల్ కు వెళ్లటానికి కూడా డబ్బులు లేవని మంత్రిని కాల్చిన సైనికుడు తనతో ఓసారి అన్నట్లుగా ప్రత్యక్ష సాక్షి తెలిపాడు.

మంత్రి కల్నల్ మరణాన్ని ఉగాండా పార్లమెంట్ స్పీకర్ దృవీకరించారు. ఎగోలాను అతని అంగరక్షకుడు కాల్చి చంపాడని తరువాత అతను కాల్చుకుని చనిపోయాడనే విచారకర వార్త వినాల్సి వచ్చిందని అతని ఆత్మకు శాంతి కలగాలను కోరుకుంటున్నామని తెలిపారు. కాగా మంత్రి కల్నల్ చార్లెస్ ప్రభుత్వ సీనియర్ అధికారి,గతంలో రక్షణ శాఖకు ఉప మంత్రిగా పనిచేశారు.