Viral Village : అదో వింత గ్రామం..ఎవ్వరూ బట్టలు వేసుకోరు..!!

Viral Village : అదో వింత గ్రామం..ఎవ్వరూ బట్టలు వేసుకోరు..!!

Strange Village Spielplatz In Britian

Strange Village Spielplatz In Britian : ప్రపంచంలో ఎన్నో వింత..మరెన్నో విచిత్రాలు. ఒక్కో ప్రాంతానిది ఒక్కో సంప్రదాయం. ఇంకెన్నో అలవాట్లు..ఆనవాయితీలు. కానీ ఓ గ్రామంలోని ప్రజలు అస్సలు బట్టలే వేసుకోరు. వాళ్లు అడవుల్లో ఉండే అరుదైన ఆటవిక తెగకు చెందినవారేమో అనుకుంటాం. కానీ కాదు. ఉన్నత చదువులు చదువుకున్నవారే. సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని చెప్పుకునే అత్యంత నాగరికత చెందిన దేశం అయిన చెప్పుకునే ది గ్రేట్ బ్రిటన్ (యునైటెడ్ కింగ్ డమ్) లో ఉందీ గ్రామం.

ఆ వింత గ్రామం పేరు ‘‘స్పీల్‌ప్లాట్జ్’’. ఈ గ్రామంలో దాదాపు అందరూ కోటీశ్వరులే కావటం విశేషం. కానీ ఈ గ్రామస్తులు ఎవ్వరూ బట్టలు ధరించరు. ఆడవారు కూడా. ప్రపంచంలో ఇలాంటి గ్రామం కూడా ఒకటి ఉందా.? అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ గ్రామంలో అందరూ కోటీశ్వరులే.. కానీ బట్టలు ధరించరు. అది వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించదట..పైగా ఇక్కడ మరో విశేషం ఏమింటటే..ఈ గ్రామం గురించి తెలుసుకోవటానికిగానీ..చూడటానికి గానీ ఎవరైనా పర్యాటకులకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఆ గ్రామంలోకి అడుగు పెట్టాలంటే బట్టలు వేసుకోకుండానే వెళ్లాలట.. అసలు వీళ్లు ఎందుకో బట్టలు వేసుకోరు?! దీని వెనుక ఉన్న కారణమేంటీ?! తెలుసుకోవాల్సిందే..

యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న ఈ వింతైన గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్. ఈ గ్రామ ప్రజలు దాదాపు 85 సంవత్సరాలు బట్టలు లేకుండా బతికారు. పైగా వీరంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే. పైగా కోటీశ్వరులు. కావల్సినంత ఆస్తిపాస్తులున్నాయి. అయినా సరే పిల్లలు,పెద్దలు, ఆడవారు, మగవారు, వృద్ధులు, ఎవ్వరూ బట్టలు లేకుండా ఉంటారు. అదివారికి సర్వసాధారణమే. సిగ్గు పడటాలు లాంటివేమీ ఉండవ్..

బట్టలు వేసుకోకుండా ప్రజలు ఉంటున్న గ్రామాన్ని 1929వ సంవత్సరంలో ఇసుల్ట్ రిచర్డ్‌సన్ కనుగొన్నాడు. అతను ఈ గ్రామాన్ని కనుగొన్నాక..అతనికి కూడా తన మిగిలిన జీవితాన్ని ఈ గ్రామంలో వారిలాగానే గడపాలని నిర్ణయించుకున్నాడట. ఈ గ్రామం నాగరిత లేనిది అనుకోవటానికి ఎంతమాత్రం వీల్లేదు. ఎందుకంటే నేటి కల్చర్ అయిన పబ్, క్లబ్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఆ గ్రామంలో నివసించేవారే కాదు అక్కడకు వచ్చే పర్యాటకులు కూడా ఈ బట్టలు ధరించని రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాలట..లేకపోతే గ్రామంలోకి అడుగు కూడా పెట్టనివ్వరట.

మరి ఈ గ్రామస్తులు బైటకు అంటే ఏదైనా పనులు మీద బైట ఊర్లకు బైట ప్రాంతాలకు వెళ్లాలంటే కూడా బట్టలు లేకుండానే వెళతారా? అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. అలాఏమీలేదు. వీళ్లు వస్తువులు, సరుకులు ఇలా వారికి అవసరమైనవి కొనుక్కోవటానికి ఈ గ్రామస్తులు వేరే నగరానికి లేదా ప్రాంతానికి వెళ్లినప్పుడు దుస్తులు ధరించే వెళతారు. అంతేకాదు వీళ్లు కొన్ని సందర్భాల్లో బట్టలు వేసుకుంటారు. జలుబు చేసినా, చలి వేసినా, జ్వరం వచ్చినా..లేదా మరేదైనా కారణం వల్ల గానీ బట్టలు ధరించాలనుకుంట ధరించవచ్చుట..ఏది ఏమైనా ఈ వింత విచిత్రమైన గ్రామం గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..