ఈ జనాలతో ఉండలేను..వాళ్లతో వేగలేను భయ్యా..నన్ను జైల్లో పెట్టండి ప్లీజ్..

ఈ జనాలతో ఉండలేను..వాళ్లతో వేగలేను భయ్యా..నన్ను జైల్లో పెట్టండి ప్లీజ్..

Uk wanted man lock down frustration : ఈ జనాల మధ్య నేనుండలేను భయ్యా..నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి ప్లీజ్ అంటూ ఓ వ్యక్తి పోలీసుల వద్దకు వచ్చి మొరపెట్టుకున్న యూకేలోని బ్రిటన్ లో జరిగింది. జైలునుంచి తప్పించుకుని బైటకు వచ్చిన ఓ వ్యక్తి ఈ కరోనా కాలంలో లాక్‌డౌన్ సమయంలో జనాల మధ్య ఉండలేకపోయాడు.

ఇంటిలోనే నాలుగు గోడలమధ్యా ఉండలేకపోయాడు. అతనికి ఏదో గందరగోళంగా అనిపించింది. బైటకెళ్లకూడదు..అలాని 20 గంటలు ఇంటిలోనే ఉండలేకపోయాడు. ఊపిరి ఆడనట్లుగా ఫీలయ్యాడు. జైల్లో అయితేనే బాగుంటుందని అనుకున్నాడు. జైలులోనే ప్రశాంతంగా ఉంటుందని భావించాడు. దీంతో ఈ జనాల మధ్య ఉండలేను సార్..నన్ను జైల్లో పెట్టండీ అంటూ బుర్గెస్ హిల్ పోలీస్ స్టేషనుకు వచ్చి లొంగిపోయాడు. లాక్‌డౌన్ సమయంలో ఎక్కువగా నాలుగు గోడల మధ్యే గడిపాల్సి రావటంతో తీవ్ర ప్రస్టేషన్ కు గురయ్యాడు. దీంతో ఇల్లు కంటే జైలే బెటర్ అనుకున్నాడు.

దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. డారెన్ టేలర్ అనే పోలీసు అధికారి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లొంగిపోయిన అతడిని జైలుకు తరలించామని తెలిపారు. కాగా లాక్ డౌన్ సమయంలో చాలామంది తీవ్ర ఒత్తిడికి గురైయ్యారని పలు సర్వేలు వెల్లడించిన విషయం తెలిసిందే.