UK Woman : ‘ఆ’ ఇంగ్లీషు అక్షరాలు తెచ్చిన తంటా .. మహిళా ఉద్యోగికి భారీ జరిమానా..!

మీరు అనవసరంగా ఊహించుకున్నారు..బాస్ తప్పేమీ లేదు..మీరు కావాలనే ఇదంతా చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి జరిమానా కట్టండి అంటూ ఓమహిళా ఉద్యోగికి కోర్టులో చుక్కెదురైంది.

UK Woman : ‘ఆ’ ఇంగ్లీషు అక్షరాలు తెచ్చిన తంటా .. మహిళా ఉద్యోగికి భారీ జరిమానా..!

UK Woman boss email

UK Woman boss email : మా బాస్ నన్ను లైంగిక వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళా ఉద్యోగిని కోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు ఆమెకు జరిమానా వింధించింది. రూ.5.1 లక్షలు సదరు కంపెనీకి చెల్లించాలంటూ ఆదేశించింది. అదేంటీ బాధితురాలికే జరిమానా విధించటమేంటి?అని అనుమానం వచ్చి తీరుతుంది. అదే ఆమెకొచ్చిన తిప్పలు…బాస్ పంపించిన మెయిల్ ఉండే కొన్ని ఇంగ్లీషు అక్షరాలు ఈ తంటాను తెచ్చి పెట్టాయి ఆమెకు..ఇంతకీ ఈ కథలో కమామీషు ఏంటంటే..

లండన్‌లో కరీనా గాస్పరోవా అనే మహిళ ఈఎస్ఎస్‌డాక్స్ అనే సంస్థలో పనిచేస్తోంది. ఆమె ఆ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు పైఅధికారి అలెగ్జాండర్ గౌలాండ్రిస్‌ ఓ మెయిల్ పంపించాడు. అందులో కొన్ని కంపెనీల పేర్లకు బదులు ‘xx’‌, Yy అనే అక్షరాలు, ప్రశ్నార్థకంతో రాసి వాటి ప్లేస్ లో తగిన పదాలు పూరించాలని పేర్కొన్నాడు. ఆ మెయిల్ చదివిని సదరు మహిళ తన బాస్ తనను లైంగికంగా వేధించేందుకే ఈ మెయిల్ చేసినట్టు భావించింది. ‘xx’‌, అంటే ముద్దులని..Yy అంటే మరింత దగ్గరయ్యేది ఎప్పుడని బాస్ పరోక్షంగా ఇంటిమేషన్ ఇచ్చినట్లుగా అర్థం చేసుకుంది. దీంతో బాస్ పై పీకల దాకా కోపమొచ్చింది. అంతే అతనితో పాటు కంపెనీని కూడా కోర్టుకు ఈడ్చింది. సెంట్రల్ కోర్టులోని ఎంప్లాయి‌మెంట్ ట్రైబ్యునల్ లో కేసు దాఖలు చేసింది. తన ఆరోపణలకు ఆధారంగా బాస్‌ రాసిన లేఖను కోర్టులో సమర్పించింది.

ఈ లేఖను చదివిన న్యాయమూర్తి దాంట్లో తప్పేముంది? ఎటువంటి దురుద్దేశమేదీ లేదని స్పష్టంచేసారు. బాస్‌ రాసిన ఈమెయిల్‌ను మహిళ తప్పుగా అర్థం చేసుకుందని..కార్యాలయాల్లో ఇటువంటి షార్ట్ కట్ పదాలు కామెన్ అంటూ తేల్చిపారేసారు. కంపెనీకి సంబంధించిన విషలను షార్ట్ కట్ గా చెప్పటంతో వాటిని ఆమె తప్పుగా అర్థం చేసుకుందని సరయిన ఆధారాలు లేకుండానే మహిళ అసాధారణ ఆరోపణలు చేసినట్టుగా కనిపిస్తోందని భావించిన కోర్టు ఇది పొరపాటు వల్ల జరిగిందని అనుకోలేమని పేర్కొంది. అంతేకాదు సదరు మహిళ ఆరోపణలు చేసిన కంపెనీకే 5 వేల పౌండ్లు (సుమారు రూ.5 లక్షలు) చెల్లించాలని ఆదేశించింది.