Wife Surprised: విడాకులు ఇస్తాడేమో అనుకున్న భర్త చివరికి భార్యకు “షాక్” ఇచ్చాడు

ఎంతో కఠినంగా ఉన్న భర్త మొహం చూసి.. విడాకులు కావాలని అడుగుతాడేమోనని ఆ ఇల్లాలు భయపడింది. యూకేకి చెందిన జూడ్ ఎడ్గెల్, తన భర్త టెర్రీ గురించి అనుకున్న మాటలు అవి

Wife Surprised: విడాకులు ఇస్తాడేమో అనుకున్న భర్త చివరికి భార్యకు “షాక్” ఇచ్చాడు

Castle

Wife Surprised: “నీతో మాట్లాడాలి.. అలా నడుచుకుంటూ వెళ్దామా” అంటూ గంభీరమైన గాత్రంతో భర్త అన్న మాటలకు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. ఎంతో కఠినంగా ఉన్న భర్త మొహం చూసి.. విడాకులు కావాలని అడుగుతాడేమోనని ఆ ఇల్లాలు భయపడింది. యూకేకి చెందిన జూడ్ ఎడ్గెల్, తన భర్త టెర్రీ గురించి అనుకున్న మాటలు అవి. టెర్రీ, జూడ్ ఇద్దరూ.. యూకే పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్నారు. భర్త మౌనాన్ని ఓపిగ్గా చూస్తున్న భార్యకు మనసులో ఎదో తెలియని ఆందోళన. ఒక్క క్షణం గుండె ఆగిపోతుందేమోనని భయపడింది. చివరకు మౌనం వీడిన భర్త.. ఇద్దరికీ బాగా తెలిసిన ఒక కోట(Palace) గురించి మాట్లాడసాగాడు. ఎంతో అద్భుతంగా ఉండే ఆ కోటను తలుచుకున్న జూడ్ కు చిన్నప్పటి తన జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. జూడ్ చిన్నతనం ఆ కోట పరిసర ప్రాంతాల్లోనే గడించింది. అలాంటి బంవంతిలో నివసించే స్థాయి తనది కాదని భావించేది. బాగా డబ్బున్న వారు మాత్రమే అలాంటి కోటల్లో నివసిస్తారని జూడ్ భావించేది.

Also read: Cat comes to Owner:15 రోజుల్లో 15 కిమీలు ప్రయాణించి యజమానిని చేరుకున్న పిల్లి

అయితే ఆరోజు భార్య జూడ్ తో కలిసి సముద్రం వొడ్డున నడుచుకుంటూ వెళ్తున్న టెర్రీ.. ఇక ఆ కోట మనదే అన్నాడు. భర్త మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జూడ్..కోటను అమ్మిన సంస్థ వెబ్ సైట్ లోకి వివరాలు చెక్ చేసింది. ఆకోట తన పేరుపై ఉండడంతో జూడ్ నమ్మలేకపోయింది. అంతులేని ఆనందంతో భర్తను గట్టిగా కౌగలించుకుంది. కొన్ని క్షణాల వరకు భర్త గాంభీర్యాన్ని చూసి విడాకులు ఇస్తాడేమోనని భావించిన జూడ్ అనుకోని విధంగా తనపై ఇంత ప్రేమ కురిపించడంతో ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయింది. ఇదేదో కథ అనుకుంటున్నారా. కానేకాదు. యూకేకి చెందిన జూడ్ ఎడ్గెల్ నిజజీవితంలో జరిగిన ఘటన ఇది.

Also read: Viral News: అర్జెంటీనా జైల్లో ఖైదీని ముద్దాడిన మహిళా జడ్జి

జూడ్ భర్త టెర్రీ.. యూకేలో ఒక పెద్ద టింబర్ వ్యాపారవేత్త. భార్యనూ కుటుంబాన్ని ఎంతో ప్రేమించే అతను, వ్యాపారంతో నిత్యం బిజీగా ఉండడంతో కుటుంబంతో గడిపేందుకు సమయం దొరికేదికాదు. దీంతో కుటుంబం మొత్తం ఎపుడైనా హాలిడేస్ కి వెళ్లి సరదాగా గడిపే విధంగా ఒక అందమైన ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలని భావించాడు. అందుకు స్పెయిన్ దేశంలో అనేక ప్రాంతాలు వెతికాడు కానీ దొరకలేదు. చివరకు యూకేలోని గ్లామోర్గాన్ వేల్ ప్రాంతంలో కౌబ్రిడ్జ్ సముద్ర తీరాన ఉన్న పెన్లిన్ కోటను కొనేందుకు నిశ్చయించుకున్నాడు టెర్రీ. 200 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ కోట కోసం ఇటీవల వేలంపాట నిర్వహిస్తున్నారన్న సంగతి తెలుసుకున్న టెర్రీకి, ఆ కోట గురించి తన భార్య జూడ్ గతంలో చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. ఆ కోటలో నివసించడం జూడ్ చిన్ననాటి కల. దీంతో ఆ కోటను ఎలాగైనా కొని.. దాన్ని తన భార్యకు బహుమతిగా ఇవ్వాలని టెర్రీ భావించాడు.

Also read: Sony Earphones: సోనీ నుంచి తక్కువ ధరలో వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

ఇంట్లో వారికి తెలియకుండా కోట కోసం బిడ్ వేసిన టెర్రీ.. ఆ కోటను £775,000 పౌండ్లకు(రూ.7.8 కోట్లు) దక్కించుకుని తన భార్యను ఆశ్చర్యానందంలో ముంచెత్తాడు. ప్రస్తుతం తన వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న టెర్రీ, కోట పూర్తి బాధ్యతను జూడ్ కు అప్పగించాడు. కోటను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా జూడ్ చర్యలు చేపట్టింది. 2024 నాటికి ఆపనులు పూర్తికానున్నాయి. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా..దీనిపై స్పదించిన నెటిజన్లు.. “పైకి గంభీరంగా ఉండే భర్తలు.. భార్యపిల్లలపై ఎంతో ప్రేమగా ఉంటారని” కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Mothers Love: తల్లికి మాటల్లో చెప్పలేని సంతోషాన్ని అందించిన కొడుకు