Ukraine Apologized: జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన యుక్రెయిన్

భారత దేశానికి చెందిన ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాం అని యుక్రెయిన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి ఎనిమిన్ జోపరోవా అన్నారు.

Ukraine Apologized: జరిగిందానికి ఎంతో చింతిస్తున్నాం.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన యుక్రెయిన్

Ukraine Defence Ministry

Ukraine Apologized: యుక్రెయిన్ రక్షణ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఇటీవల ఓ అభ్యంతరకర చిత్రాన్ని పోస్టు చేసింది. పేలుడు కారణంగా ఎగసిన దూళిపై హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తుకు తెచ్చేలా ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో ఓ చిత్రాన్ని షేర్ చేసింది. పైకి లేస్తున్న స్కర్ట్‌లో ఉన్న స్త్రీ చిత్రం అయినప్పటికీ.. ఆ చిత్రానికి పొందుపర్చిన వేషధారణ మహంకాళీ అవతారంలో ఉన్నట్లుగా ఉంది. ఈ ట్వీట్‌ను చూసిన భారతీయులు సోషల్ మీడియా వేదికగా యుక్రెయిన్‌పై విమర్శలకు దిగారు. ఈ చిత్రం హిందూ దేవత కాళీని పోలి ఉందని, ఇలాంటి చిత్రాలతో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యుక్రెయిన్ ప్రవర్తించిందంటూ కొందరు భారతీయులు ట్వీట్లు చేశారు.

Ukraine Defence Ministry: పేలుడు పొగపై కాళీమాత చిత్రం.. భారతీయుల దెబ్బకు ట్వీట్‌ను తొలగించిన యుక్రెయిన్ రక్షణ శాఖ

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వివాదంగా మారుతున్న క్రమంలో యుక్రెయిన్ రక్షణ శాఖ స్పందించింది.. వెంటనే ఆ చిత్రాన్ని ట్విటర్ నుంచి తొలగించింది. ఆ తరువాత ఈ విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా కాళికా దేవతను కించపరిచేలా చేసిన ట్వీట్‌పై యుక్రెయిన్ భారత్‌కు క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఆ దేశపు విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎమిన్ జోపరోవా ట్వీటర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు.

 

 

భారత దేశానికి చెందిన ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మేం ఎప్పుడూ గౌరవిస్తాం. జరిగిన దానికి ఎంతో చింతిస్తున్నాం అని ఎనిమిన్ జోపరోవా అన్నారు. హిందూ దేవత కాళిని అవమానించేలా ఉన్న చిత్రాన్ని వెంటనే తొలగించామని అన్నారు. భారత్ నుంచి యుక్రెయిన్ కు ఎప్పుడూ మద్దతు ఆశిస్తామని పేర్కొన్నారు. అయితే, ఇకముందు కూడా ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని ఆశిస్తున్నామని ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.