Ukraine war: యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధం: బైడెన్

ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాను సన్నద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్ కు కూడా ఉంటే చర్చలు జరుపుతానని చెప్పారు. అయితే, దీనిపై పుతిన్ నుంచి స్పందన లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో కలిసి జో బైడెన్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Ukraine war: యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌తో చర్చలు జరిపేందుకు నేను సిద్ధం: బైడెన్

Ukraine war

Ukraine war: ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చర్చలు జరిపేందుకు తాను సన్నద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయితే, యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్ కు కూడా ఉంటే చర్చలు జరుపుతానని చెప్పారు. దీనిపై పుతిన్ నుంచి స్పందన లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో కలిసి జో బైడెన్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడారు.

యుద్ధం జరుగుతున్న వేళ రష్యా తీరుకు వ్యతిరేక ధోరణిని తాము కొనసాగిస్తామని ఫ్రాన్స్, అమెరికా అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు. జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడి కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. రష్యా ప్రయోజనాలకు అనుగుణంగా చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగానే ఉన్నారని పేర్కొంది. అయితే, అమెరికా పెడుతున్న షరతులను ఒప్పుకునేందుకు రష్యా సిద్ధంగా లేదని క్రెమ్లిన్ మీడియా కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

Ricky Ponting: కామెంటరీ చేస్తున్న సమయంలో రికీ పాంటింగ్‌కు గుండెపోటు?.. ఆసుపత్రికి తరలింపు

‘‘నిజానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఏమంటున్నారు? ఉక్రెయిన్ ను రష్యా వదిలేస్తేనే చర్చలు సాధ్యమని అంటున్నారు’’ అని డిమిత్రి పెస్కోవ్ విమర్శించారు. ఉక్రెయిన్ లోని ఏయే ప్రాంతాలను రష్యా చట్టబద్ధంగా తమవని పేర్కొందో, వాటిని అమెరికా గుర్తించడం లేదని చెప్పారు. కాగా, కొన్ని నెలలుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేదు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..