Russian Soldiers : ఆగని రష్యా బలగాల ఆరాచకాలు.. భయంతో జుట్టు కత్తిరించుకుంటున్న యుక్రెయిన్ అమ్మాయిలు!

Russian Soldiers : యుక్రెయిన్‌లో రష్యా అరాచకాలు ఆగడం లేదు. సైనిక చర్య పేరుతో దేశంలోకి చొరబడి యుక్రెయిన్ ప్రజలను విచక్షణ లేకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి రష్యా బలగాలు.

Russian Soldiers : ఆగని రష్యా బలగాల ఆరాచకాలు.. భయంతో జుట్టు కత్తిరించుకుంటున్న యుక్రెయిన్ అమ్మాయిలు!

Ukrainian Girls Cut Their Hair Short To Avoid Being Raped By Russian Soldiers, Says Official

Russian Soldiers : యుక్రెయిన్‌లో రష్యా అరాచకాలు ఆగడం లేదు. సైనిక చర్య పేరుతో దేశంలోకి చొరబడి యుక్రెయిన్ ప్రజలను విచక్షణ లేకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి రష్యా బలగాలు. ఆడపిల్లలు కనిపిస్తే చాలు.. వారిపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఒకవైపు యుద్ధం.. మరోవైపు యుక్రెయిన్లపై రష్యా బలగాల కీచక పర్వం కొనసాగుతోంది. యుక్రెయిన్ ప్రజలు పడుతున్న బాధలు వర్ణాతీతం. రష్యా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ప్రపంచదేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యన్ బలగాలకు భయపడి యుక్రెయిన్ కు చెందిన ఆడపిల్లలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.

రష్యా బలగాలకు కంటపడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రష్యా బలగాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఆడపిల్లలు అందరూ తమ జుట్టు కత్తిరించుకుంటున్నారట. ఈ మేరకు ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ వార్త తెలియగానే.. ఇవాన్ కివ్ ప్రాంత డిప్యూటీ మేయర్ కన్నీటిపర్యంతమయ్యారు. 35 రోజుల పాటు పుతిన్ ఆధీనంలోని తమ దేశీయ ప్రజలంతా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. యుక్రెయిన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యారు. వారి వయస్సు 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ ఇద్దరు బాలికలను బేస్మంట్ నుంచి జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు.

Ukrainian Girls Cut Their Hair Short To Avoid Being Raped By Russian Soldiers, Says Official (1)

Ukrainian Girls Cut Their Hair Short To Avoid Being Raped By Russian Soldiers, Says Official

అనంతరం దారుణంగా రష్యా బలగాలు ఆ చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డారు. అది తెలిసిన యుక్రెయిన్ ఆడపిల్లలంతా బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. రష్యన్ బలగాల ఆకృత్యాలకు బలి కాకుండా ఉండాలంటే.. తాము అందంగా కనిపించకూడదని అక్కడి ఆడపిల్లలందరూ తమ జట్టును కత్తిరించుకోవడం చేస్తున్నారని ఇవాన్ కివ్ డిప్యూటీ మేయర్ వెల్లడించారు. రష్యా బలగాలను నిలువరించేందుకు యుక్రెయిన్ సేనలు కొత్తగా బ్రిడ్జి నిర్మించారు. ఈ ప్రాంతంలో కొంతవరకు రష్యా సేనాల నుంచి రక్షణగా ఉందని డిప్యూటీ మేయర్ అభిప్రాయపడ్డారు.

రష్యా బలగాల బారినపడిన వారంతా తాము పడిన మానసిక శారీరక వేదనను వెలిబుచ్చారు. రష్యా దాడుల్లో 12 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడని ఒక మహిళ తన బాధను చెప్పుకొచ్చింది. ఇలాంటి ఎందరో తమ బాధలను ఒక్కొక్కటిగా బయటకు చెబుతూ కన్నీంటిపర్యంతమవుతున్నారు.

Read Also : Russia Ukraine war: రష్యా కౄరత్వానికి హద్దులు లేకుండా పోయింది: యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ