వీళ్లు చాలా రిచ్ : ఐఫోన్లతో ఇంటి ప్రహరీగోడ కట్టేశారు!!

10TV Telugu News

ఒక్క ఐఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడేవాళ్లు ఎందరో. చేతిలో ఐఫోన్  ఉందంటే వాళ్లు రిచ్ అన్నమాటే. నీకేంటిరా బాబూ నువ్వు ‘రిచ్చ కిడ్’ ఐఫోన్ కొనుక్కుంటావ్..అంటారు ఫ్రెండ్స్. ఒకే ఒక్క ఐఫోన్ కొనుక్కోవటానికి నానా పాట్లు పడేవాళ్లు ఎందరో ఉన్నారు. ఎందుకంటే అది ఐఫోన్ అంతే. అదో ఎవ్వరూ అందుకోలేని సూపర్ బ్రాండ్. దానికి తగ్గట్లే ఉంటుంది దాని కాస్ట్ కూడా. 

అటువంటిదో ఏకంగా ఐఫోన్లతో ఇల్లే కట్టేసిన ఓ వెరీ వెరీ రిచెస్ పర్సన్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టకుండా ఉంటామా? ఏంటీ!!! ఐఫోన్ తో ఇల్లు కట్టటమా? నువ్వేం మాట్లాడతున్నావో తెలుస్తోందా? నేను మరీ అంత ‘అలా’’ కనిపిస్తున్నానా అని అనుకోకతప్పదు. కానీ ఇది నిజ్జంగా నిజం..అదికూడా ఐఫోన్-6 ఫోన్లతో..ఈ మాట వింటే చాలు ప్రపంచంలో ఉన్న ఆశ్చర్యమంతా మన మొఖంలోనే కనిపిస్తుంది. మరిన ఆ ఐఫోన్-6 రిచ్ హౌస్ గురించి తెలుసుకుందాం..

వియాత్నాంకు చెందిన ఓ టిక్‌టాక్ యూజర్ పోస్టు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ వీడియోను 1.7 మిలియన్ మందికి పైగా చూశారు. ఓ ఇంటి ప్రహారీకి నిర్మాణంలో టైల్స్‌కు బదులుగా ఐఫోన్-6లను వాడటమే ఇందుకు కారణం. ఒకటి కాదు పదులు కాదు.. ఏకంగా కొన్ని వందల ఫోన్లను అతడు ఇంటి ప్రహారికి టైల్స్‌లా వాడేశాడు. 

కాగా..ఆ ఇంటికి  టైల్స్‌లా కనిపిస్తున్న ఆ ఫోన్లన్నీ iPhone-6 మోడల్‌ వే.ఐఫోన్-6 మోడళ్లను ఆపిల్ సంస్థ ఎప్పుడో నిలిపేసింది. వాటి అప్‌డేట్స్ కూడా రావడం లేదు. దీంతో ఆ ఐఫోన్-6 వినియోగదారులు.. ఆ ఫోన్‌ను అప్‌డేట్ చేయలేక అమ్మేశారో.. లేదో పనిచేయని ఐఫోన్లను కొనుగోలు చేసి ఆ వ్యక్తి ఇంటికి వాడాడో తెలీదుగానీ.. లుక్ మాత్రం భలే సూపర్ గా  ఉంది. ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అంటారు.

Read: బ్లాడర్‌లో ఛార్జింగ్ కేబుల్.. పెన్నిస్ గుండా చొరబెట్టుకున్న వ్యక్తి

      ×