Most Wanted Criminal List : ‘మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో నా పేరు లేదేంటీ?’ అంటూ పోలీసుల్ని ప్రశ్నించి అడ్డంగా బుక్కైన నేరస్థుడు

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో నా పేరే లేదేంటీ? అంటూ ప్రశ్నించి అడ్డంగా బుక్ అయ్యాడో నేరస్థుడు.

Most Wanted Criminal List : ‘మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్టులో నా పేరు లేదేంటీ?’ అంటూ పోలీసుల్ని ప్రశ్నించి అడ్డంగా బుక్కైన నేరస్థుడు

Most Wanted Criminals List

Most Wanted Criminal List : నేరాలు చేసిన తప్పించుకుని తిరిగేవాడు కామ్ గా ఉండకుండా తన గుట్టుతానే బయటపెట్టుకున్నాడో నేరస్థుడు.పోలీసులు విడుదల చేసిన మోస్ట్ వాంటెడ్ లిస్టులో తన పేరు లేకపోవటం తన ‘ఇమేజ్’ డ్యామేజ్ అయిందనుకున్నాడో ఏమోగానీ సోషల్ మీడియాలో పోలీసులు విడుదల చేసిన ‘మోస్ట్ వాంటెడ్ లిస్టులో నా పేరు లేదేంటీ?’ అంటూ పోస్ట్ పెట్టి పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు ఓ నేరస్తుడు.

అమెరికాలోని జార్జియా పోలీసులు టాప్‌ 10 మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుల జాబితాను రాక్‌డేల్‌ కౌంటీ షెరీఫ్‌ ఆఫీస్‌ అధికారులు ఇటీవల విడుదల చేశారు. హత్యలు, ఆయుధాలతో బెదరించి దోపిడీ చేయటం, కిడ్నాప్ వంటి నేరాలకు పాల్పడిన నేరస్థుల పేర్లను ఫోటోలతో సహా విడుదల చేశారు. ఈ లిస్టును ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్‌ చేశారు. ఈక్రమంలో అప్పటికే పలు నేరాలు చేసి (కొన్ని నేరాల నమోదు అయ్యాయి) పోలీసులకు చిక్కకుండా చేసి దీంతో ఇందులో తన పేరు లేదని.. గుర్తించిన క్రిస్టఫర్‌ స్పాల్డింగ్‌ అనే నేరస్థుడు.. ‘మరి నా సంగతి ఏంటి?’ అని కామెంట్‌ చేశాడు.

దీంతో స్పాల్డింగ్ కు పోలీసులు ఝలక్ ఇచ్చారు. పోలీసులు సమాధానం చెబుతూ.. ‘నువ్వు చెప్పింది నిజమే. నీ మీదా రెండు వారెంట్లు ఉన్నాయి.. నీకోసం వస్తున్నాం..’ అని రిప్లై ఇచ్చారు. ‘నిన్ను పట్టుకోవడానికి నువ్వే సహాయం చేశావు భలే ..అందుకు నీకు మా అభినందనలు’అంటూ అతడి ఫొటోతో సహా ఫేస్‌బుక్‌లో వ్యంగ్యంగా మరో పోస్ట్‌ పెట్టారు పోలీసులు. నేరస్థుల జాబితాలో పేరు లేనంత మాత్రాన వారి గురించి వెతకడం లేదని అర్థం కాదని గుర్తుచేశారు. చెప్పినట్లుగానే పోలీసులు మరునాడే స్పాల్డింగ్‌ను అరెస్టు చేశారు.

మా టాప్ 10 మోస్ట్‌వాంటెడ్ లిస్టు తీవ్రతను బట్టే ఈ లిస్టును తయారు చేశామని..వారెంట్ ఉండి ఈ జాబితాలో పేరు లేకుంటే మా సిబ్బంది నీ కోసం వెతకడం లేదని అర్థం కాదు అంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. నేరానికి పాల్పడిన రెండు వారెంట్లు జారీ అయిన స్పాల్డింగ్‌ను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహరించి, సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు ఉన్నతాధికారులు.