అందుకే పాక్‌పై అమెరికా ఆంక్షలు : ఇక వీసా కష్టమే!

దాయాది పాకిస్థాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలో పాకిస్థాన్ జాతీయులను బహిష్కరించినప్పటికీ వారిని తిరిగి తమ దేశానికి వచ్చేందుకు ఇస్లామాబాద్ నిరాకరించింది.

  • Published By: sreehari ,Published On : April 27, 2019 / 01:27 PM IST
అందుకే పాక్‌పై అమెరికా ఆంక్షలు : ఇక వీసా కష్టమే!

దాయాది పాకిస్థాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలో పాకిస్థాన్ జాతీయులను బహిష్కరించినప్పటికీ వారిని తిరిగి తమ దేశానికి వచ్చేందుకు ఇస్లామాబాద్ నిరాకరించింది.

దాయాది పాకిస్థాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాలో బహిష్కరించిన పాకిస్థాన్ జాతీయులను తిరిగి తమ దేశానికి రప్పించేందుకు ఇస్లామాబాద్ నిరాకరించింది. యూఎస్ లో పాక్ జాతీయుల వీసా గడువు ముగిసినప్పటికి వారు అక్కడే ఉండటంపై అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పాకిస్థాన్ వీసాలను రద్దు చేస్తామని అమెరికా హెచ్చరించింది. పాకిస్థాన్ తో దౌత్యపరమైన సంబంధాల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండబోవని స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. పాకిస్థాన్ కు వీసాల జారీ విషయంలో మాత్రమే ఆంక్షలు వర్తిస్తాయని ఫెడరల్ రిజిస్టర్ నోటిఫికేషన్ లో పేర్కొంది.

పాక్ వీసాలను అమెరికా నిలిపివేసే అవకాశం ఉందని అధికారి ఒకరు వెల్లడించారు. యూఎస్ చట్టం ప్రకారం.. వీసా ఆంక్షలు విధించిన పది దేశాల్లో తాజాగా పాకిస్థాన్ చేరింది. దేశం నుంచి బహిష్కరణకు గురైనవారు, వీసా గడువు ముగిసినవారిని తిరిగి తమ దేశానికి రప్పించేందుకు ఈ దేశాలు నిరాకరిస్తున్నాయి. దీంతో అమెరికా వీటిపై వీసా ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఎనిమిది దేశాలపై ట్రంప్ ప్రభుత్వం వీసా ఆంక్షలు విధించింది. 2019లో అమెరికా వీసా ఆంక్షలు విధించిన దేశాల్లో ఘనాతో పాటు పాకిస్థాన్ చేరాయి. దీంతో పది దేశాలపై వీసా ఆంక్షలు విధించింది ట్రంప్ ప్రభుత్వం.

2001లో గయానా, 2016లో గాంబియా, కాంబోడియా, ఎరిట్రేయా, గుయేనియా, సియేరా లియోన్ దేశాలపై 2017, బర్మా, లావోస్ లో 2018లో యూఎస్ వీసా ఆంక్షలు విధించింది. పాకిస్థాన్ పై వీసా ఆంక్షల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. పాకిస్థాన్ లో దౌత్యపరమైన సంబంధాల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్టేట్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

యూఎస్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సమస్యలపై చర్చ జరిగే అవకాశం ఉందని, ఎప్పుడు అనేది కచ్చితంగా చెప్పలేమని అన్నారు. వీసా ఆంక్షలపై యూఎస్ లో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ స్పందిస్తూ.. పాకిస్థానీలు అమెరికా వెళ్లడం ఇక కష్టమేనన్నారు. ట్రంప్ ప్రభుత్వం అధికారికంలో వచ్చిన తర్వాత నుంచే దేశ బహిష్కృతులు, వీసా గడువు ముగిసినవారిపై కఠిన చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి తమ దేశ చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్న దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ఆంక్షలు విధిస్తోంది.