అది బ్లడ్డా..మట్టి గడ్డా..! యువకుడి రక్తంలో పెరిగిన పుట్టగొడుగులు..!!

అది బ్లడ్డా..మట్టి గడ్డా..! యువకుడి రక్తంలో పెరిగిన పుట్టగొడుగులు..!!

US Man Injects Magic Mushroom : మట్టిలో పెరగాల్సిన పుట్టగొడుగులు ఏకంగా మనిషి రక్తంలో పెరిగితే ఎలా ఉంటుంది? అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోవచ్చు. కానీ పాపం ఓ 30 ఏళ్ల యువకుడి రక్తంలో పెరిగిన పుట్టగొడుగుల్ని చూసి డాక్టర్లు సైతం షాక్ అయ్యారు? అదెలా జరిగిందబ్బా? అని ఆశ్చర్యపోయారు.

అమెరికాలోని ఓ 30 ఏళ్ల వ్యక్తి డయేరియాతో రక్తపు వాంతులు కావటంతో బాధపడుతూ..హాస్పిటల్ కు వచ్చాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు బై పోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. ఇదొక మానసిక వ్యాధి. ఇటువంటి వ్యాధి కలిగినవారు సడెన్ గా వారిలో ఉండే పర్సనాలిటీ ఛేంజ్ అయిపోయి వింత వింత పనులు చేస్తుంటారు. ఆ వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు.

తనకు బై పోలార్ డిజార్డర్ ఉన్నట్లుగా సదరు యువకుడు తెలుసుకున్నాడు. ఇటువంటి సమస్య ఉన్నవారు పుట్టగొడుగుల్లో ఉండే సిలోసైబిన్ పదార్థంతో నయమవుతుందని తెలుసుకున్నాడు. దాంతో అతను డాక్టర్ల సలహా మేరకు రాసిచ్చిన రెగ్యులర్ గా వాడే మందులను ఆపేసి..సైకీడెలిక్ పుట్టగొడగులు లేక మ్యాజిక్ మష్రూమ్స్ గా పిలిచే పుట్టగొడుగులతో టీ తయారు చేసి దాన్ని తన రక్తనాళాల్లోకి ఎక్కించుకున్నాడు.

ఆ ప్రభావంతో కొన్నిరోజులకు అతనికి డయేరియాతో పాటు రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో బాగా నీరసించిపోయాడు. ఈక్రమంలో అతని చర్మం కూడా పసుపురంగులోకి మారడం ప్రారంభించింది. అది చూసి భయపడిన తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అతడి పరిస్థితి చూసి అనుమానం వచ్చిన డాక్టర్లు పలు టెస్టులు చేశారు.

ఈక్రమంలో అతని ఆర్గాన్స్ పనితీరులో కూడా మార్పులు వచ్చాయని గుర్తించారు. అవయవాలు పనితీరు అంతకంతకూ క్షీణిస్తుంటంతో వెంటనే ఐసీయూలో చేర్చారు. మరికొన్ని టెస్టులు చేయగా..అతడి రక్తంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయిలో ఉన్నట్టు గుర్తించారు. ఆ ఫంగల్ ఎలా వచ్చిందే అనుమానంతో డాక్టర్లు బాధితుడుని ప్రశ్నించారు.దానికి అతను చెప్పిన సమాధానికి షాక్ అయ్యారు. డాక్టర్లు సలహా లేకుండా అలా ఎలా చేస్తావని మందలించారు.

పుట్టగొడుగుల టీని రక్తనాళాల్లోకి ఎక్కించుకోవడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరుకుందని..ఇప్పుడా పుట్టగొడుగులు అతడి రక్తంలో పెరుగుతున్నాయని గుర్తించారు. దీంతో అతని రక్తం తిరిగి శుద్ధి జరగాలంటే ట్రీట్ మెంట్ దీర్ఘకాలం జరగాలనితెలిపారు. దీంతో సదరు యువకుడు ఏడు రోజుల పాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. మొత్తమ్మీద 22 రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందాడు. చివరికి చావు తప్పి ప్రాణాలతో బైటపడ్డాడు.