US President Biden : కీవ్‌ నగరంలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌!?

US President Biden : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లోని కీవ్ నగరం ధ్వంసమైంది.

US President Biden : కీవ్‌ నగరంలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌!?

Us President Biden's Visit To Ukraine Only A Matter Of Time Intelligence Committee Chief

US President Biden : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య యుద్ధం కారణంగా యుక్రెయిన్‌లోని కీవ్ నగరం ధ్వంసమైంది. యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌.. కీవ్ నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అమెరికా హౌస్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఆడమ్‌ స్కిఫ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా కాంగ్రెస్‌ బృందం కీవ్‌ నగరంలో 3 గంటలు పాటు సమావేశమైంది. దీనికి సంబంధించి వివరాలను స్కిఫ్‌ వెల్లడించారు. కీవ్ నగరంలో బైడెన్‌ పర్యటించే విషయం ఇంకా పరిశీలనలోనే ఉందన్నారు.

తూర్పు యుక్రెయిన్‌లో పోరాటానికి కావాల్సిన సాయంపై జెలెన్‌స్కీతో భేటీలో చర్చించినట్టు ఆడమ్‌ స్కిఫ్‌ తెలిపారు. యుక్రెయిన్‌ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసేది లేదన్నారు. కానీ, అత్యంత దగ్గరగా ఉండి యుద్ధంలో పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. సుదూరం నుంచి యుద్ధం చేయాలంటే.. లాంగ్‌ రేంజి శతఘ్నులను ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా యుద్ధం రూపురేఖలను మార్చేయగలదని చెప్పారు. సమావేశం ముగిసిన అనంతరం అమెరికా కాంగ్రెస్‌ బృందంలోని సభ్యులు అధ్యక్షుడు బైడెన్‌కు సమాచారాన్ని అందజేశారు. ఆయన పర్యటన ఎప్పుడు అనేది ఇంకా చర్చకు రాలేదన్నారు.

Us President Biden's Visit To Ukraine Only A Matter Of Time Intelligence Committee Chief (1)

Us President Biden’s Visit To Ukraine Only A Matter Of Time Intelligence Committee Chief

అజోవ్‌స్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా దళాలు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తున్నాయని యుక్రెయిన్‌ ఆరోపించింది. కొందరు యుక్రెయిన్‌ ప్రజలను ఉక్కు ప్లాంట్‌ నుంచి బయటకు తరలించినట్టు తెలిపారు. ఆ తర్వాత రష్యా దళాలు మళ్లీ దాడులకు తెగబడుతున్నాయని పేర్కొంది. తద్వారా పౌరల తరలింపులో అవరోధాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుక్రెయిన్‌ సరిహద్దుల్లోని బెల్‌గోరోడ్‌ ఆయుధ డిపోలో భారీ ఎత్తున ప్రమాదం జరిగింది. రెండు భారీ పేలుళ్లు జరిగినట్లు గవర్నర్‌ టెలిగ్రామ్‌ అకౌంట్లో తెలిపారు. మంటలు చెలరేగిన ప్రాంతం రక్షణ మంత్రిత్వశాఖ ఆధీనంలోనే ఉందన్నారు. దీనికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. యుక్రెయిన్‌ దళాలు తమ భూభాగాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయని రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు.

Read Also : joe biden: ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం: జో బైడెన్