joe biden: ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం: జో బైడెన్

రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

joe biden: ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం: జో బైడెన్

Joe Biden

joe biden: రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని డోన్బస్ ప్రాంతంలో పోరాడుతున్న సైన్యానికి ఆయుధాలు అందజేస్తామని చెప్పారు. జో బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. మరియపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై కూడా బైడెన్ అనుమానాలు వ్యక్తం చేశాడు.

Russia ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఘాటు వ్యాఖ్యలు

అదే జరిగితే, ప్రజలు అక్కడ్నుంచి సురక్షితంగా తరలి వెళ్లేందుకు మానవతా కారిడార్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. మరియపోల్‌ను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారం లేదన్నారు. మరియపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌కు ఇప్పటికే భారీ సాయం అందించిన అమెరికా, అదనంగా 800 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని కూడా ప్రకటించింది.