Ancient Crystal: 83 కోట్ల ఏళ్ల నాటి స్పటికంను పగలగొట్టనున్న శాస్త్రవేత్తలు: జీవం గుట్టు తెలిసే అవకాశం

సుమారు 830 మిలియన్ ఏళ్ల(సుమారు 83 కోట్లు సంవత్సరాలు) నాటిదిగా భావిస్తున్న ఈ స్పటికంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న పురాతన సూక్ష్మజీవులు మరియు ప్రొకార్యోటిక్ మరియు ఆల్గల్ కారక జీవులు ఉన్నట్లు తేల్చారు

Ancient Crystal: 83 కోట్ల ఏళ్ల నాటి స్పటికంను పగలగొట్టనున్న శాస్త్రవేత్తలు: జీవం గుట్టు తెలిసే అవకాశం

Crystal

Ancient Crystal: అనంతకోటి విశ్వంలో..భూమి కాక మరో గ్రహంపై జీవాన్వేషణ కోసం ఏళ్లకేళ్లుగా ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. విశ్వంలో భూమి లాంటి గ్రహాలు కొన్ని ఉన్నప్పటికీ వాటిపై జీవం ఆవిర్భవించే వాతావరణం మాత్రం లేదు. అయితే భూమిపై ఉన్నట్లుగానే..ఇతర గ్రహాల్లోనూ ఎక్కడోచోట కచ్చితంగా జీవం ఉండే ఉంటుందన్న బలమైన విశ్వాసాన్ని కొనసాగిస్తూనే..శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈక్రమంలో లక్షల ఏళ్ల నాటి పరిస్థితులను తెలుసుకుంటే..విశ్వంలో జీవం గుట్టు తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమిపై లభించిన కొన్ని పదార్ధాలపై పరిశోధన జరుపుతున్న శాస్త్రవేత్తలకు..క్రియాశీలకంగా ఉన్న లక్షల ఏళ్ల నాటి స్పటికం ఒకటి లభించింది. జియోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికాకు చెందిన పరిశోధకులు ఇటీవల ఈ స్పటికన్ని కనుగొన్నారు.

సుమారు 830 మిలియన్ ఏళ్ల(సుమారు 83 కోట్లు సంవత్సరాలు) నాటిదిగా భావిస్తున్న ఈ స్పటికంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న పురాతన సూక్ష్మజీవులు మరియు ప్రొకార్యోటిక్ మరియు ఆల్గల్ కారక జీవులు ఉన్నట్లు తేల్చారు. స్పటికంలో ఉన్న సూక్ష్మ గదుల్లో ద్రవం చేరి..అది సూక్ష్మ జీవులకు నిలయంగా మారినట్టు పరిశోధకులు గుర్తించారు. కోట్ల ఏళ్ల నాటి ఈ స్పటికంపై పరిశోధనలు జరుపుతున్న వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్త కాథీ బెనిసన్, మాట్లాడుతూ “ఆ స్పటికంలో ఉన్న అసలు ద్రవం..ఘనీభవించి ఉప్పుగా మారిందని, ఇక్కడ ఆశ్చర్యం పరిచే ఏమిటంటే, సూక్ష్మజీవుల నుండి మనం ఆశించే వాటికి అనుగుణంగా ఉండే ఆకృతులను కూడా స్పటికంలో గుర్తించామని మరియు 830 మిలియన్ సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ స్పటిక ద్రావణంలో సూక్ష్మ జీవులు ఇప్పటికీ జీవించి ఉండవచ్చని” అన్నారు.

other stories: Scotland : అందాల దీవుల్లో నివసిస్తే..రూ. 48 లక్షలిస్తామని ప్రకటించిన ప్రభుత్వం

స్పటికంను పగలగొట్టి..అందులోని ద్రవం, సూక్ష్మ జీవులపై పరిశోధనలు జరిపితే విశ్వంలో జీవం గుట్టు కనిపెట్టడం తేలిక అవుతుందని కాథీ వెల్లడించారు. కానీ అది అనుకున్నంత సులువు కాదని కూడా ఆమె పేర్కొన్నారు. స్పటికంను పగలగొట్టి..దానిలోని సూక్ష్మ జీవుల పై జరిపే పరిశోధనను “ఒక హారర్ సినిమాతో” పోల్చారు కాథీ. ఎందుకంటే..స్పటికంలో ఉన్న కోట్ల ఏళ్ల నాటి సూక్ష్మ జీవుల తీరుతెన్నులు తెలియదు గనుక..అవి ప్రస్తుతం భూమిపై ఉన్న వాతావరణంలోకి ప్రవేశిస్తే వాటి ప్రవర్తన ఎలా రూపాంతరం చెందుతుందో కూడా ఇప్పుడు అంచనా వేయడం కష్టమని కాథీ బెనిసన్ పేర్కొన్నారు. అయితే కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో జీవం ఎలా మనుగడ సాధించిందనే విషయాన్ని తెలుసుకుంటే..భవిష్యత్తులో జీవ పరిణామంపై మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చని వారు పేర్కొన్నారు.

other stories: Briran Inflation : ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న బ్రిటన్..భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు