Briran Inflation : ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న బ్రిటన్..భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

ద్రవ్యోల్బణంతో బ్రిటన్ అల్లాడుతోంది. ఏడాదికాలంలో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు 9శాతం పెరిగాయి. 40 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ధరాఘాతానికి తగ్గట్టుగా వేతనాలు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధ ప్రభావం, కరోనా పరిస్థితులు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్నాయి.

Briran Inflation :  ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న బ్రిటన్..భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

Briran Inflation..jumps To 40 Year High Of 9% (1)

Briran Inflation..jumps to 40-year high of 9% : ద్రవ్యోల్బణంతో బ్రిటన్ అల్లాడుతోంది. ఏడాదికాలంలో ఆ దేశంలో నిత్యావసరాల ధరలు 9శాతం పెరిగాయి. 40 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ధరాఘాతానికి తగ్గట్టుగా వేతనాలు లేకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. యుక్రెయిన్ యుద్ధ ప్రభావం, కరోనా పరిస్థితులు బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్నాయి.

యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది రెండు దేశాల మధ్యే అయినా ఆ ప్రభావం మొత్తం ప్రపంచంపైన పడుతోంది. యుద్ధంతో ముడిచమురు ధరలు పెరగడం, వంటనూనెలు, గోధుమలు వంటి ధరలూ పెరగడం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను పతనం చేస్తోంది. ఇప్పుడా జాబితాలోకి బ్రిటన్ చేరింది. కరోనా కాలం నుంచి బ్రిటన్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. భారీ ట్రక్కుల డ్రైవర్లు దొరక్క, నిత్యావసరాల రవాణాకు ఆటంకాలు ఏర్పడి…పసిపిల్లలకు పాలపొడి సైతం దొరకని దుర్భర పరిస్థితులు ఎదుర్కొంది. కరోనా, లాక్ డౌన్ ప్రభావం నుంచి కోలుకుంటుండగానే…యుద్ధం బ్రిటన్ ప్రజలకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.

Also read : Russia ukraine war : ఎన్నీళ్లీ మారణకాండ..యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగిసేది ఎప్పుడు?

బ్రిటన్‌లో ఏడాది కాలంలో నిత్యావసరాల ధరలు 9శాతం పెరిగాయి. 40 ఏళ్ల కాలంలో ఆ దేశంలో ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి. కొన్ని నెలల్లోనే ద్రవ్యోల్బణం 10శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ హెచ్చరించింది. గ్యాస్ ధరలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు సైతం అమాంతం పెరిగిపోయాయాయి. దీంతో ఇంటి బడ్జెట్‌ను అమాంతం పెరిగి ప్రజలు లబోదిబోమంటున్నారు. చెప్పాలంటే ప్రస్తుతం భారత్‌ పరిస్థితులకు, బ్రిటన్‌కు ఏమాత్రం తేడాలేదు.
మనదేశంలోలానే గ్యాస్, కరెంటు ధరలు చూసి బ్రిటన్ ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Also read : Donald Trump : అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి..గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు

ధరల పెరుగుదలను అడ్డుకోవడం ప్రజల చేతుల్లోనే ఉందని ఇంగ్లండ్ బ్యాంక్ అంటోంది. ప్రజలు ఎక్కువ ఖర్చు పెట్టడానికి బదులు ఎక్కువ ఆదా చేయాలని కోరింది. అలాగే వడ్డీ రేట్లు పెంచడం వల్ల భారం పెరిగి ప్రజలు అప్పులెక్కువ చేయకుండా ఉంటారని బ్యాంక్ భావిస్తోంది. అదే సమయంలో ఇంటింటికీ నగదు పథకం అమలు చేయాలన్న ఆలోచనా చేస్తోంది.