Biden’s Secret Files : దేశాధ్యక్షుడు అయినా జో బైడెన్ ఇంట్లో FBI సోదాలు .. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా US ఫైల్స్ ఇష్యూ

మెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఇంట్లో సోదాలు ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సోదాలు నిర్వహించింది. ఏకంగా 13గంటలపాటు సోదాలు చేసింది. కొన్ని కీలక ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే అది అమెరికా అక్కడి చట్టాలకు దేశాధ్యక్షుడైనా సామాన్య ఉద్యోగి అయినా ఒక్కటే. కానీ భారత్ లో అలా కాదు. అధికారంలో ఉన్న నేతలపై కన్నెత్తి కూడా చూడవు దర్యాప్తు సంస్థలు. ప్రతిపక్షాలమీద మాత్రం ఏకధాటిగా ఊపిరి తీసుకోనివ్వకుండా దాడులు జరుగుతుంటాయి. 

Biden’s Secret Files : దేశాధ్యక్షుడు అయినా జో బైడెన్ ఇంట్లో FBI సోదాలు .. ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా US ఫైల్స్ ఇష్యూ

Biden's Secret Files

Biden’s Secret Files :  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ఇంట్లో సోదాలు ఆ దేశ దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సోదాలు నిర్వహించింది. ఏకంగా 13గంటలపాటు సోదాలు చేసింది. కొన్ని కీలక ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకుంది. ఎందుకంటే అది అమెరికా అక్కడి చట్టాలకు దేశాధ్యక్షుడైనా సామాన్య ఉద్యోగి అయినా ఒక్కటే. కానీ భారత్ లో అలా కాదు. అధికారంలో ఉన్న నేతలపై కన్నెత్తి కూడా చూడవు దర్యాప్తు సంస్థలు. ప్రతిపక్షాలమీద మాత్రం ఏకధాటిగా ఊపిరి తీసుకోనివ్వకుండా దాడులు జరుగుతుంటాయి.  ఒక్క ఇండియా మాత్రమే కాదు.. ఎన్నో దేశాల్లో ఇలాంటి ఘటనలు ఒక్కటి కూడా జరిగి ఉండవేమో.కానీ అమెరికా తీరే వేరు. దేశాధ్యక్షుడైనా సరే.. ఆయన ఇంట్లో దర్యాప్తు సంస్థల సోదాలు ఆగడం లేదు. పైగా.. సీక్రెట్ ఫైల్స్ వ్యవహారం.. ప్రెసిడెంట్ బైడెన్ మెడకు చుట్టుకుంటోంది. చేతిలో పవర్ ఉన్నా.. దేశాన్ని శాసించే అధికారం ఉన్నా.. కనుసైగతో దర్యాప్తు సంస్థలను దారికి తెచ్చుకునే శక్తి ఉన్నా.. అవేవీ అక్కడ పనిచేయడం లేదు. ఇలాంటి సీన్‌ను.. మనం ఇండియాలో ఎప్పటికైనా చూడగలమా..? అంటే అబ్బే అస్సలు సమస్యేలేదు అనాల్సిందే.

రహస్య ఫైళ్ల వ్యవహారం.. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మెడకు చుట్టుకుంటోంది. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ సీక్రెట్ ఫైల్స్.. బైడెన్ ఇంట్లో బయటపడటం.. ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. బైడెన్ నివాసంలో.. తాజాగా చేపట్టిన సోదాల్లో మరో ఆరు ఫైళ్లు లభ్యం కావడం అమెరికాలో కలకలం రేపుతోంది. విల్మింగ్టన్‌లోని బైడెన్ ప్రైవేట్ నివాసంలో.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు.. గంటల పాటు సోదాలు చేశారు. మొత్తం ఆరు ఫైళ్లను కనుగొన్నారు. వాటితో పాటు చేతి రాతతో ఉన్న కొన్ని పత్రాలు కూడా దొరికినట్లు తెలుస్తోంది. ఆ ఫైళ్లలో కొన్ని బైడెన్ సెనేటర్‌గా ఉన్నప్పటివని.. కొన్ని వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన కాలానికి సంబంధించినవని.. ఆయన పర్సనల్ అటార్నీ తెలిపారు.

గతేడాది నవంబర్ 2న.. వాషింగ్టన్ డీసీలో బైడెన్‌కు చెందిన పెన్ బైడెన్ సెంటర్‌లో, డిసెంబర్ 20న వాషింగ్టన్‌ ఇంట్లోని గ్యారేజీలో, ఈ ఏడాది జనవరి 12న అదే ఇంట్లో మరోసారి సీక్రెట్ ఫైల్స్ బయటపడటంతో.. తీవ్ర దుమారం రేగుతోంది. తర్వాత.. వాటిని నేషనల్ ఆర్కైవ్స్‌కి అందజేశారు. అయితే.. ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. పదవీకాలం ముగిసిన తర్వాత.. అధికారిక రహస్య పత్రాలను కలిగి ఉండటం చట్ట విరుద్ధం. ఇటువంటివాటిని అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఈ వ్యవహారమంతా అమెరికాలో కాబట్టి అక్కడి చట్టాలు అలాగే ఉంటాయి కాబట్టి బైడెన్ దేశాధ్యక్షుడైనా సరే దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళ్లిపోతున్నాయ్. మరి.. ఇలాంటి పరిస్థితులే భారత్‌లో తలెత్తితే.. మన దేశంలో అమెరికా లాంటి దృశ్యం చూడగలమా? అన్నదే.. అసలు పాయింట్.

US Files : అమెరికాలో అలా..భారత్‌లో ఎందుకిలా? ప్రతిపక్ష నేతలపై జరిగే దర్యాప్తు సంస్థల దాడులు అధికారంలో ఉన్నవారిని ఎందుకు టచ్ చేయవు? కారణం అదేనా?..

ప్రజాస్వామ్య దేశంలో.. ఎవరు తప్పు చేసినా.. ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. అందుకు తగ్గ విచారణ జరగాల్సిందే. జరిపి తీరాల్సిందే. ఈ విషయంలో.. అమెరికా ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. అప్పుడే.. ప్రజాస్వామ్యానికంటూ.. విలువ ఉంటుంది. అందుకే.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైనా ఎఫ్‌బీఐ సోదాలు ఆగడం లేదు. ఇన్వెస్టిగేషన్‌కి ఎలాంటి బ్రేక్ పడటం లేదు. సీక్రెట్ ఫైల్స్ వ్యవహారంలో ఏదో ఒకటి తేలేదాకా.. బైడెన్ నివాసంలో సోదాలు జరుగుతూనే ఉంటాయి. అదే.. ఇండియాలో అయితే.. రూలింగ్ పార్టీ నాయకులపై ఇలాంటి సోదాలు చేయాల్సి వస్తే.. దర్యాప్తు సంస్థలు ఇంత ధైర్యంగా పనిచేయగలవా? అక్కడ అమెరికా పౌరుడైనా.. ఆ దేశ అధ్యక్షుడైనా.. అందరికీ ఒకే ట్రీట్‌మెంట్ కనిపిస్తోంది. మరి.. మన దేశంలో ఆ పరిస్థితులున్నాయా? ఇప్పుడు అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఇదే.

ఇండియాలో.. అధికార పార్టీ నాయకులపై ఏవైనా ఆరోపణలు వస్తే.. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు సొంతంగా నిర్ణయం తీసుకొని.. సోదాలు చేయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తాయ్. నాయకుల ఇళ్లపై రైడ్ చేయాలంటే.. వాళ్లకు పై నుంచి ఆర్డర్స్ రావాలి. అప్పుడు మాత్రమే.. వాళ్లు తమ ఆఫీసుల గేట్లు దాటి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల ఇళ్లలోకి అడుగు పెడతారు. సోదాలు చేస్తారు. అప్పటిదాకా.. బయట జరిగే డ్రామా అంతూ చూస్తూ కూర్చుంటారనే విమర్శలున్నాయ్. జాతీయ స్థాయిలో అయితే సీబీఐ, ఈడీ, ఐటీ .. రాష్ట్ర స్థాయిలో అయితే ఏసీబీ అధికారుల టార్గెట్ ఎప్పుడూ ప్రతిపక్షాలే అన్నది మనకు అందరికీ తెలిసిన సత్యమే. అధికార పార్టీ నేతల ఇళ్లల్లో సోదాలు చేయడం, భారీగా డబ్బును సీజ్‌ చేయడం పెద్దగా ఎప్పుడూ కనిపించదు. కానీ.. అమెరికాలో అలాంటివేవీ కనిపించట్లేదు. యూఎస్ ఫైల్స్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుందంటే కారణం.. బైడెన్ ఇంట్లో సోదాలే. ఆయన ఇంట్లో రహస్య పత్రాలు బయటపడటం, దానిపై.. అమెరికాలో పొలిటికల్ దుమారం రేగడం, తర్వాత ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగడం.. ఇవన్నీ పక్కనబెడితే.. దేశాధ్యక్షుడి ఇంట్లోకి.. దర్యాప్తు సంస్థలు నేరుగా వెళ్లి సోదాలు చేయడం, సీక్రెట్ ఫైళ్లు బయటపెట్టడమే ఇప్పుడు సంచలనంగా మారింది. అందరినీ ఆలోచింపజేస్తోంది.