Memory Loss : గతం మర్చిపోయిన భర్త..భార్యను చూసి షాక్..స్కూల్ కు వెళతానంటూ మారాం

10TV Telugu News

US Man who forgot the past 20 years : అమెరికా టెక్సాస్‌కు చెందిన డానియల్ పోర్టర్ అనే 37 ఏళ్ల వ్యక్తి స్కూలు కెళతానంటూ బ్యాగ్ పట్టుకుని రెడీ అయ్యాడు. భార్యా పిల్లల్ని చూసి మీరెవరు?మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు.మా ఇంటికి ఎందుకొచ్చారు? అంటూ అడుగుతున్నాడు. దీంతో డానియల్ భార్యాపిల్లలకు దిమ్మ తిరిగిపోయింది. స్కూల్ కు వెళతానంటూ రెడీ అయ్యేందుకు అద్దం ముందు నిలబడి తనను తానే అద్దంలో కూడా అద్దిరిపడ్డాడు. ఈసారి దిమ్మ తిరిగిపోవటం అతని వంతే అయ్యింది. ఇంతకీ ఇతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడంటే..నిద్ర నుంచి లేచి తన గతం మొత్తం మరచిపోయాడు డానియల్.అంతేకాదు తనను తానే మర్చిపోయాడు. భార్యా పిల్లల్ని కూడా మర్చిపోయాడు. తాను 16 ఏళ్ల కుర్రాడిలా ఫీల్ అయ్యాడు.

టెక్సాస్ హియరింగ్‌ స్పెషలిస్ట్‌గా పని చేసే డానియల్ పోర్టర్ నిద్ర నుంచి లేచి తన గతం మర్చిపోయాడు. తనని తాను 16 ఏళ్ల కుర్రాడిలా ఫీల్ అవుతున్నాడు. భార్య రుత్, పదేళ్ల కూతురిని కూడా మరిచిపోయాడు. అద్దంలో తనని తాను చూసుకుని బేరారెత్తిపోయాడు.నేంటీ ఇలా ఉన్నాను..ఇంత పెద్దాడిలాగా..ఇంత లావుగా ఉన్నాను అనుకుని తెగ ఆశ్చర్యపోయాడు. ఇంతలో అక్కడికి వచ్చిన భార్యను చూసి బిత్తరపోయాడు.‘నువ్వు ఎవరు?ఇక్కడెందుకున్నావు? అంటూ ప్రశ్నించాడు. దీంతో భార్య ఏంటీ డియర్ జోక్ చేస్తున్నావా? అంటూభుజం మీద చేయి వేసి సరదాగా అడిగింది. ఏ నువ్వెవరని అడిగితే దగ్గరకొస్తున్నావేంటీ? అంటూ దూరంగా వెళ్లిపోయాడు. భర్త ఏదో సరదాగా అన్నాడని అనుకున్న ఆమె రాత్రి తాగిన డ్రింగ్ ప్రభావం ఇంకా పోలేదేమోనని అనుకుంది. భర్తను పరిశీలనగా చూసింది. ఏదో తేడా కనిపించింది.

దీంతో రుత్ భర్త ప్రవర్తనతో భయపడింది. ఏమైందోనని ఆందోళన చెందింది. కానీ తమాయించుకుని ‘ అదేంటీ పోర్టర్ నేను రుత్ ని నీ భార్యను అని చెప్పింది. కానీ అతను నమ్మలేదు.నువ్వెవరో నాకు తెలియదని మళ్లీ అదే మాట చెప్పాడు.దానికి రుత్ నీను నీ భర్యనే..మనకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయ్యింది..ఇది మన కూతురు అంటూ కూతుర్ని చూపించింది.కానీ పోర్టర్‌ ఒప్పుకోలేదు. నమ్మనే లేదు. నేను స్కూలుకెళ్లే పిల్లాడిని నాకు భార్యాపిల్లలు ఉండటమేంటీ అంటూ వాదించాడు. ఈ సందర్భంగా పోర్టర్‌ భార్య రుత్ మాట్లాడుతూ.. ‘‘ఉదయాన్నే అతడు నిద్రలేచినప్పటినుంచి నా భర్త నేనెవరో తెలియనట్లే ఉన్నాడని..చాలా గందరగోళంగా ఉన్నాడు. మేముండే ఇంటిని..మా రూమ్ ను గుర్తు పట్టలేదు. బాగా తాగేసి ఉన్నాడేమో అనుకున్నాను. కానీ చాలా తేడాగా ఉన్నాడు. తనను ఎవరో కిడ్నాప్ చేసి నన్ను ఈ రూమ్‌లో బంధించారేమో అంటున్నాడని ఆందోళనపడుతూ బయటకు పారిపోయేందుకు యత్నించడాడని వాపోయింది.

‘‘ఆ తర్వాత నా భర్త పోర్టర్‌కి.. నేను తన భార్యనని చెప్పేందుకు నమ్మించటానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఫోటోలు చూపించాను. కానీ అతను నమ్మట్లేదు. తాను 16 ఏళ్ల కుర్రాడననే అంటున్నాడు. అద్దంలో చూసుకుని ఆందోళన పడిపోతున్నాడు. తనమీద తానే కోప్పడిపోతున్నాడు. నేను ఎందుకు ఇంత లావుగా, పెద్దవాడిలాగా ఉన్నాను అనుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నాడని స్థానిక మీడియాకు తెలిపింది. తన చదువు, తను ఉద్యోగం అన్నీ మరిచిపోయాడు. దీంతో అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాం’’ అని తెలిపింది.పోర్టర్‌ని పరీక్షించిన వైద్యులు.. అతడు ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా‌తో బాధపడుతున్నాడని..దీన్నే ‘షార్ట్ టెర్మ్ మెమరీలాస్’ అని కూడా అంటారని తెలిపారు. త్వరలోనే సర్దుకుంటుందని..ఏమీ ఆందోళన పడవద్దని చెప్పారు.

ఈ మతిమరుపు వల్ల డానియల్ తన 20 ఏళ్ల గతాన్ని మరిచిపోయాడు. దీంతో భార్య రుత్ అతన్ని పాత జ్ఞాపకాలు గుర్తు చేయటానికి ఎన్నో రకాలుగా యత్నిస్తోంది. అతడు బాల్యంలో నివసించిన ఊరికి తీసుకెళ్లింది. పాత స్నేహితులతో కలిపింది. వారితో మాట్లాడించింది. వారు ఎన్నో రకాలుగా తమ చిన్ననాటి విషయాలు చెప్పారు. కానీ ఏమాత్రం మార్పులేదు డానియల్ లో. డానియల్ విషయంలో మరో చిత్రం ఏమిటంటే గతంలో తాను తినే ఆహారాన్నికూడా మర్చిపోయాడు. గతంలో తినేవి ఏవీ ఇప్పుడు తినటంలేదు. ఇలా మతిమరుపు భర్తతో రూత్ ఆరు నెలలుగా సఫర్ అవుతోంది.అతనికి తిరిగి గతం గుర్తు చేయటానికి ఎన్నో రకాలుగా యత్నిస్తోంది. ఆమె యత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. అన్నీ నెమ్మదిగా గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతం పోర్టర్‌ థెరపీకి వెళ్తున్నాడు. కానీ ఇంకా చాలా విషయాలు గుర్తు రావాల్సి ఉందట.దీంతో రుత్ భర్తను అనుక్షణం కాపాడుకుంటోంది. అతను పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే వరకూ అలాగే చూసుకుంటానంటోంది.

10TV Telugu News