Hybrid kidney: హైబ్రీడ్ కిడ్నీ.. ఇక డయాలసిస్‌ అవసరం లేదు

దేశంలోనూ.. ప్రపంచంలోనూ.. మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

Hybrid kidney: హైబ్రీడ్ కిడ్నీ.. ఇక డయాలసిస్‌ అవసరం లేదు

Hybrid

USA California Scientists: దేశంలోనూ.. ప్రపంచంలోనూ.. మూత్రపిండాల వైఫల్యానికి సంబంధించిన కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారికి డయాలసిస్ ద్వారా శరీరంలోని మలినాలను తొలగించుకుంటారు. డయాలసిస్ అనేది ఇబ్బందికరమైన పద్దతే కాదు.. ఖర్చుతో కూడుకున్నది కూడా. అటువంటి డయాలసిస్‌ పద్దతికి త్వరలోనే గుడ్‌బై చెప్పే అవకాశం కనిపిస్తోంది.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు కృత్రిమ కిడ్నీలను అభివృద్ధి చేస్తుండగా.. త్వరలో అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశం కనిపిస్తుంది. సిలికాన్‌ ఫిల్టర్‌తోపాటు సజీవమైన రీనల్‌ కణాలతో కూడిన ఈ హైబ్రిడ్‌ కిడ్నీ నమూనా ఇప్పటికే సిద్ధమైంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి చేసిన ప్రయోగాలు సక్సెస్ అవ్వగా.. కిడ్నీ వ్యవస్థకు అనుసంధానించి శరీరంలోనే ఉంచగల తక్కువ సైజులో ఉంటుంది ఈ హైబ్రిడ్‌ కిడ్నీ.

ఈ హైబ్రిడ్ కిడ్నీ ఒక్కసారి శరీరంలో అమర్చుకుంటే, ఎప్పటికీ బ్యాటరీ అవసరం కూడా లేకుండా శరీరంలో రక్తం ప్రవహించే ఒత్తిడితోనే మలినాలను తొలగించుకోవచ్చునని చెబుతున్నారు. శరీరం ఈ వ్యవస్థను తిరస్కరించకుండా ఉంచేందుకు మందులేవీ వాడాల్సిన అవసరం కూడా లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. ది కిడ్నీ ప్రాజెక్ట్‌ పేరుతో కాలిఫోర్నియా వర్సిటీ వారు చేస్తున్న ఈ ప్రయత్నాల ఫలితంగా అరచేతిలో ఇమిడిపోయేంత చిన్న సైజు యంత్రం తయారైందని, కంప్యూటర్‌ చిప్‌ల తయారీలో ఉపయోగించే సిలికాన్‌ సాయంతో అతిసూక్ష్మమైన రంధ్రాలున్న ఫిల్టర్‌ను తయారు చేసినట్లు వారు చెప్పారు.

శరీరంలో రెండు మెయిన్ ధమనులకు ఈ హైబ్రిడ్‌ కిడ్నీని అనుసంధానించి, శుద్ధి చేయాల్సిన రక్తం ఒక గొట్టం గుండా దీంట్లోకి ప్రవేశపెడుతారు. శుద్ధి చేసిన రక్తం మరో ధమని గుండా శరీరంలోకి చేరుతుంది. వ్యర్థాలన్నింటినీ మూత్రాశయానికి మళ్లించి బయటకు పంపిస్తారు. ఈ హైబ్రిడ్‌ కిడ్నీలో రక్తంలో ఉండాల్సిన నీరు, ఇతర లవణాలను నియంత్రించే రీనల్‌ ట్యూబుల్‌ సెల్స్‌తో కూడిన బయో రియాక్టర్‌ ఉంటాయి. రోగి తాలూకూ రోగ నిరోధక వ్యవస్థ ఈ కణాలపై దాడి చేసే అవకాశం లేకుండా తగిన రక్షణ ఏర్పాట్లు కూడా ఉంటుంది.