Viral Video: గర్భంతో ఉన్న నల్లజాతీయురాలిని కాల్చి చంపిన పోలీసు.. ఎందుకంటే?

అమెరికాలో చాలా మంది వద్ద తుపాకులు ఉంటాయి. ఎవరినైనా అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు..

Viral Video: గర్భంతో ఉన్న నల్లజాతీయురాలిని కాల్చి చంపిన పోలీసు.. ఎందుకంటే?

Viral Video

Updated On : September 3, 2023 / 6:37 PM IST

Viral Video – Pregnant Black Woman: నల్ల జాతీయురాలు, గర్భిణీ అయిన టాకియా యంగ్ (21) అనే యువతిని పోలీసులు కాల్చి చంపారు. అమెరికా(USA)లోని ఓహియోలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోలీసుల బాడీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఈ వీడియోను ఓహియో పోలీసులు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అమెరికాలో చాలా మంది వద్ద తుపాకులు ఉంటాయి. ఎవరినైనా అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం నిందితులు లొంగిపోవాలి. లేదంటే పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారు.

టాకియా యంగ్ అనే యువతిని ఓ చోరీ కేసులో ప్రశ్నించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో ఆమె కారులో ఉంది. అందులో నుంచి దిగి రావాలని పోలీసులు కోరారు. అయితే, తాను ఎందుకు దిగి రావాలని ఆ యువతి ఎదురు ప్రశ్నించింది. తాను కారులో నుంచి దిగబోనని తెగేసి చెప్పింది.

చోరీ చేశావని ఆరోపణలు ఉన్నాయని, ఎక్కడికీ పారిపోకుండా తమకు లొంగిపోవాలని అన్నారు. ఆమె వినిపించుకోకపోవడంతో దిగుతావా? లేదా? అని ఓ పోలీసు అధికారి తుపాకీ చూపించి బెదిరించాడు. దీంతో ఆ యువతి వెంటనే కారును ముందుకు పోనిచ్చింది. ఆ సమయంలో ఆమెను పోలీసు కాల్చేశాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Viral Video: రైల్లో దొంగతనానికి వెళ్లి కష్టాల్లో ఇరుక్కున్నాడు.. చావు అంచున 80కి.మీ వేగంతో ప్రయాణం