Elephant Returns Shoe : ఎంత మంచి మనసు.. చిన్నారి షూ తీసిచ్చిన ఏనుగుపై ప్రశంసల వర్షం.. వీడియో వైరల్

ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ గజరాజు తన మంచితనంతో నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. నీది ఎంత మంచి మనసు అని ప్రశ్నంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తన తొండంతో తీసి చిన్నారి చేతికి అందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లోని ఓ జూలో ఈ ఘటన జరిగింది.

Elephant Returns Shoe : ఎంత మంచి మనసు.. చిన్నారి షూ తీసిచ్చిన ఏనుగుపై ప్రశంసల వర్షం.. వీడియో వైరల్

Elephant Returns Shoe : ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ గజరాజు తన మంచితనంతో నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. నీది ఎంత మంచి మనసు అని ప్రశ్నంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తన తొండంతో తీసి చిన్నారి చేతికి అందించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని షాంగ్ డోంగ్ ప్రావిన్స్ లోని ఓ జూలో ఈ ఘటన జరిగింది.

ఓ కుటుంబం జూకి వెళ్లింది. అక్కడ జంతువులను చూస్తూన్నారు. అలా ఏనుగులు ఉన్న ఎన్ క్లోజర్ వద్దకు ఆ ఫ్యామిలీ వెళ్లింది. అంతా నిలబడి వాటిని చూస్తుండగా.. ఓ చిన్నారి షూ ఆ ఎన్ క్లోజర్ లో పడిపోయింది. దీంతో ఆ ఫ్యామిలీ కంగారు పడింది. పాప షూ తీసుకోవడం ఎలాగో అర్థం కాలేదు. ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ ఏనుగు నుంచి అనూహ్య స్పందన కనిపించింది.

షూ ని గమనించిన ఏనుగు.. మెల్లగా తన తొండంతో పట్టుకుంది. ఆ తర్వాత పైన నిల్చున్న వారికి దాన్ని అందజేసింది. ఆ షూను తీసుకున్న పిల్లలు.. కొంత గడ్డిని ఆ ఏనుగుకు ఇచ్చారు. దీన్నంతా కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ ఏనుగు అలా షూని తిరిగి ఇవ్వడం వారిని విస్మయానికి గురి చేసింది. దాని మంచితనానికి, గొప్ప మనసుకి, ప్రవర్తనకు వారు ఫిదా అయ్యారు.

అంతే.. ఏనుగు చిన్నారి షూను తీసిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ గజరాజు మంచితనానికి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నీది ఎంత మంచి మనసు, గొప్ప మనసు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

గజరాజు గొప్ప మనసు..