Viral Video: దుకాణాన్ని తుడిచే బ‌ట్ట‌తో బాదుతూ దొంగ‌తో మ‌హిళ డిష్యూం.. డిష్యూం

దుకాణాన్ని తుడిచే బ‌ట్ట‌తో దొంగ‌తో మ‌హిళ పోరాడింది. చివ‌ర‌కు ఆ దొంగ దుకాణం నుంచి పారిపోయాడు. ట‌ర్కీలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. బేక‌రీని ఓ మ‌హిళ బ‌ట్ట‌తో శుభ్రం చేస్తోన్న స‌మ‌యంలో ఓ దొంగ అందులోకి చొర‌బ‌డ్డాడు. మహిళ ఎదురుదాడి చేసి చోరీ జరగకుండా అడ్డుకుంది.

Viral Video: దుకాణాన్ని తుడిచే బ‌ట్ట‌తో బాదుతూ దొంగ‌తో మ‌హిళ డిష్యూం.. డిష్యూం

Thief1

Viral Video: దుకాణాన్ని తుడిచే బ‌ట్ట‌తో దొంగ‌తో మ‌హిళ పోరాడింది. చివ‌ర‌కు ఆ దొంగ దుకాణం నుంచి పారిపోయాడు. ట‌ర్కీలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. బేక‌రీని ఓ మ‌హిళ బ‌ట్ట‌తో శుభ్రం చేస్తోన్న స‌మ‌యంలో ఓ దొంగ అందులోకి చొర‌బ‌డ్డాడు. ఆ స‌మ‌యంలో బేక‌రీలో ఆ మ‌హిళ త‌ప్ప ఎవ‌రూ లేరు. బేక‌రీలోకి చొర‌బ‌డిన వెంట‌నే త‌న వ‌ద్ద ఉన్న క‌త్తిని తీసి ఆ మ‌హిళ‌ను బెదిరిస్తూ డ‌బ్బు తీసుకోబోయాడు ఆ దొంగ‌.

అయితే, బేక‌రీని శుభ్రం చేస్తోన్న బ‌ట్ట‌తోనే ఆ దొంగ‌ను కొట్టింది మ‌హిళ‌. ఆమెను ఆ దొంగ ఎదిరించ‌లేక‌పోయాడు. దొంగ‌ను విడ‌వ‌కుండా ఆ మ‌హిళ కొడుతూనే ఉంది. ఆమె ఎంత‌కు అత‌డిని విడ‌వ‌క‌పోవ‌డంతో దొంగ బెదిరిపోయి పారిపోబోయాడు. అదే స‌మ‌యంలో త‌లుపు నుంచి మ‌రో వ్య‌క్తి లోప‌లికి వ‌చ్చి ఆ దొంగ‌ను ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, ఆ దొంగ వేగంగా అక్క‌డి నుంచి పారిపోయాడు. దొంగ‌ను ఎదిరించి పోరాడిన మ‌హిళను నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల జ‌ల్లులో ముంచి ఎత్తుతున్నారు.