wedding Dress Guinness Record : వరల్డ్ రికార్డు సాధించిన వెడ్డింగ్ డ్రెస్ .. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా

వివాహాల్లో వధువులు ధరించే డ్రెస్సులు..లెహంగాలు ట్రెండ్ కు తగినట్లుగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే ఓ యువతి ధరించి వెడ్డింగ్ డ్రెస్సు వరల్డ్ రికార్డు సాధించింది.

wedding Dress Guinness Record : వరల్డ్ రికార్డు సాధించిన వెడ్డింగ్ డ్రెస్ .. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా

wedding gown Guinness World Record

wedding Dress Guinness World Record : ఈరోజుల్లో వధువులు వివాహంలో ధరించే డ్రెస్సుల్ని ప్రత్యేకించి డిజైన్ చేయించుకుంటున్నారు. అదే సెలబ్రిటీలైతే ఇక చెప్పనే అక్కర్లేదు. సెలబ్రిటీలు వివాహాలకే కాదు ఫంక్షలకు కూడా పేరుపొందిన డిజైనర్లతో డ్రెస్సుల్ని డిజైన్ చేయించుంటు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. అతిథుల చూపంతా తమవైపే ఉండేలా చూసుకుంటున్నారు. ఇది సెలబ్రిటీలకే కాదు సాధారణ మహిళలు కూడా సెలబ్రిటీల రేంజ్ లో డ్రెస్సులు ధరించి ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా వివాహాల్లో వధువులు ధరించే డ్రెస్సులు..లెహంగాలు ట్రెండ్ కు తగినట్లుగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. దాంట్లో భాగంగానే ఓ యువతి ధరించి వెడ్డింగ్ డ్రెస్సు వరల్డ్ రికార్డు సాధించింది. మరి ఆ డ్రెస్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

ఓ యువతి క్రిస్టల్స్ తో తన వెడ్డింగ్ గౌనును డిజైన్ చేయించుకుంది. ఆ గౌను ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ పెళ్లి డ్రెస్సులో 50,890 క్రిస్టల్స్ ను ఉపయోగించి డిజైన్ చేశారు. చేతి స్లీవ్స్ కూడా క్రిస్టల్స్ తో తయారు చేశారు. ఇక ఈ వెడ్డింగ్ డ్రెస్సును ఇటాలియన్ బ్రైడల్ ఫ్యాషన్ బ్రాండ్ డిజైన్ చేశారు. మైఖేలా ఫెర్రెరో ఫ్యాషన్ షోలో ఈ డ్రెస్సును ప్రదర్శించారు. ఈ గౌనును డిజైన్ చేసేందుకు దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందట. పెళ్లి రోజు మోడల్ మార్చె గెలానీ కావ్ అల్కాంటే ఈ గౌనును ధరించింది. ఈ వెడ్డింగ్ గౌన్ ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. గతంలో రికార్డు ఓజ్డెన్ గెలిన్లిక్ మోడా తసరిమ్ లిమిటెడ్ పేరుతో నమోదు అయ్యింది. ఈ గౌనుపై క్రిస్టల్స్ కుట్టటానికి 200గంటలు పట్టిందట..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా చాలా ప్రత్యేకమైనది.జీవితంలో ఒక్కసారి చేసుకునే వివాహం వారి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోవాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. అటువంటి వివాహంలో ధరించే దస్తుల్ని ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవటం ఈరోజుల్లో సర్వసాధారణమైపోయింది. పెళ్లికి వచ్చిన అతిథుల చూపంతా కూడా పెళ్లికూతురు దుస్తులపైనే ఉండాలి. అందుకే పెళ్లి చీర కానీ, లెహెంగా కానీ, చాలా స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటారు. అలా డిజైన్ చేసిందే ఈ గౌను ప్రపంచ రికార్డు సాధించింది.