Halaal Holiday : హలాల్‌ హాలిడే అంటే ఏమిటి? ముస్లిం మహిళల కోసం హోటల్స్ ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి..?

ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ దేశాల్లో 'హలాల్‌ హాలిడే'కు డిమాండ్ పెరుగుతోంది. 'హలాల్‌ హాలిడే' అంటే ముస్లిం యువతులు ఇష్టపడుతున్నారు. ఈ 'హలాల్‌ హాలిడే' కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లోని హోటల్స్ ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు.

Halaal Holiday : హలాల్‌ హాలిడే అంటే ఏమిటి? ముస్లిం మహిళల కోసం హోటల్స్ ఎందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి..?

Halaal Holiday

Halaal Holiday : ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఇస్లామిక్ దేశాల్లో ‘హలాల్‌ హాలిడే’కు డిమాండ్ పెరుగుతోంది. గతంలో కంటే ముస్లిం యువతులు, మహిళలు తమ హక్కుల కోసం పోరాడటానికి ముందుకొస్తున్నారు. దీంట్లో భాగంగానే ‘హలాల్‌ హాలిడే’కు డిమాండ్ పెరుగుతోందని చెప్పుకోవాలి. ‘హలాల్‌ హాలిడే’ అంటే ముస్లిం యువతులు ఇష్టపడుతున్నారు. వారి కోసం ఈ ‘హలాల్‌ హాలిడే’ కోసం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లోని హోటల్స్ ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ట్రెండ్ కు తగినట్లుగా సౌకర్యాలు కల్పిస్తేనే ఆయా హోటల్స్ వంటివాటికి ఆదాయం పెరుగుతుంది. ఈక్రమంలో పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్ యాజమాన్యాలు ఈ ‘హలాల్‌ హాలిడే’కు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం వసతుల్ని కల్పిస్తున్నారు. వారి సంప్రదాయల ప్రకారం ఫాలో కావటానికి సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు.

అయితే ‘హలాల్ హాలిడే’ దీనిని భిన్నమైనదని చెప్పాలి. అసలీ హలాల్ హాలిడే అంటే ఏంటో తెలుసుకుందాం. ముస్లింలు ఇస్లామిక్ నియమాలను అనుసరిస్తూనే ఎక్కడైనా పర్యటించడమే హలాల్ హాలిడే. వారి మత ఆచారాలను పాటిస్తునే వారికి నచ్చిన పర్యాటక ప్రాంతాల్లో గడుపుతారు. అటువంటి వారి ఆచారాలను గౌరవిస్తు మరోపక్క తమ ఆదాయం పెంచుకోవటానికి అనేక హోటళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. చాలా మంది ముస్లింలు విహారయాత్రకు వెళ్లినప్పుడు వారికి అనువైన అంటే తమ ఆచారా వ్యవహారాలకు తగినట్లుగా సౌకర్యాలు ఉంటాయో లేవో అని చెక్ చేసుకుంటుంటారు. ఇప్పుడు హలాల్ హాలిడేను దృష్టిలో ఉంచుకుని పలు హోటళ్లు ఏ‍ర్పాటుకావటంతో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా ‘హలాల్‌ హాలిడే’ కోసం ఏర్పాటు చేసే హోటళ్లలో మద్యం ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఆహారం విషయంలో కూడా మతాచారాలకు అనువైనవే అందుబాటులో ఉండేలా ఆయా హోటల్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Biden, Elon Musk : ఆశ్చర్యంగా అనిపించలేదన్న బైడెన్, కాస్త లేట్ అయ్యిందన్న మస్క్.. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతిపై కామెంట్లు

అంతేకాదు ఇస్లాం ఆచారాల్లో వస్త్ర ధారణ అనేది చాలా చాలా ముఖ్యమైనదనే విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో వస్త్ర ధారణ విషయంలో ఇబ్బంది రాకుండా ఆయా హోటల్స్ వంటి స్టే చేసే ప్రదేశాలలో దుస్తులకు సంబంధించిన నియమాలు కూడా ఇస్లాం ఆచారాల ప్రకారమే ఉండేలా చేస్తున్నారు.

అలాగే ముస్లిం మహిళ స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాలనుకుంటే ఆయా హోటళ్లలో వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. హోటల్ సిబ్బంది కూడా ఇస్లాం సంప్రదాయాలు పాటించేవారిని ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ‘హలాల్‌ హాలిడే’ కోసం ఏర్పాటైన ప్రాంతాల్లో నమాజ్ చేసుకునే వీలు ఉంటుంది. వారి మతాచారాల కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి వసతుల్ని అందుబాటులో ఉంచటంతో ముస్లిం యువతులు వారి మత నిబంధనల విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ హలాల్ హాలిడే వల్ల ట్రావెల్ బిజినెస్ కూడా పెరుగుతోంది. గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్ ప్రకారం..2022లో హలాల్ ట్రావెల్ బిజినెస్ 220 బిలియన్ డాలర్లుగా మారింది.అంటే దీనికి ఎందుకు అంత డిమాండ్ పెరుగుతోంది ఊహించుకోవచ్చు.

2023 గ్లోబల్ ముస్లిం ట్రావెల్ ఇండెక్స్‌లో చాలా ముస్లిం దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇండోనేషియా మరియు మలేషియాలు అగ్ర స్థానాలను కలిగి ఉన్నాయి. కేవలం రెండు ముస్లిమేతర దేశాలైన సింగపూర్ (11వ స్థానం), బ్రిటన్ (20వ స్థానం) మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లండన్‌ 1899లో ప్రారంభించబడిన ఓ ఫైవ్ స్టార్ ల్యాండ్‌మార్క్ హోటల్ ఇప్పుడు హలాల్ మాంసాన్ని అందిస్తోంది. హోటల్ సిబ్బందికి ముస్లిం మతపరమైన,సాంస్కృతిక అవగాహనలో ట్రైనింగ్ కూడా ఇస్తోంది.