మిత్రదేశాలతో ట్రంప్ తప్పిదాలను బైడెన్ సరిదిద్దగలడా?

  • Published By: sreehari ,Published On : November 8, 2020 / 03:16 PM IST
మిత్రదేశాలతో ట్రంప్ తప్పిదాలను బైడెన్ సరిదిద్దగలడా?

Joe Biden’s win means for the world : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి జో బిడెన్ విజయం సాధించారు. వచ్చే ఏడాదిలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా బైడెన్ వైట్ హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. జో బెడెన్ విజయంతో ప్రపంచం పట్ల అమెరికాలో అనూహ్య మార్పుకు నాంది పలికిందనే చెప్పాలి.

ఇంతకీ బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ద్వారా అన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అర్థమా? అంటే ఇప్పుడే చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.



ప్రముఖ డెమొక్రాటిక్ నేత బైడెన్ 2021 జనవరిలో అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికైన సందర్భంగా  ప్రపంచానికి తానొక నేస్తంలా ఉంటానని హామీ ఇచ్చారు.

తాను ట్రంప్ కంటే అమెరికా మిత్రదేశాలతో స్నేహపూర్వకంగా ఉంటానని, అలాగే నిరంకుశవాదులపై మాత్రం కఠినంగా ఉంటానని బైడెన్ ప్రతిజ్ఞ చేశారు.

ఏదేమైనా, తాను ఊహించిన విధానాల కంటే విదేశాంగ విధానం సవాలుగా మారొచ్చు అంటున్నారు విశ్లేషకులు.

మాజీ అధ్యక్షుడు ఒబామాతో వైట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతిగా బిడెన్ ఎన్నో మార్పులు చూశారు. ట్రంప్ విధానాల పట్ల చాలావరకు వ్యతిరేకత నెలకొంది.

దాంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలు ట్రంప్ అహాన్ని దెబ్బతీశారు.

ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులతో సహా ట్రంప్ కొన్ని వివాదాస్పద విధానాలను తిప్పికొట్టడానికి అమెరికా మిత్రదేశాలతో మరింత సన్నిహితంగా పనిచేయడానికి బిడెన్ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు.



చైనాపై ట్రంప్ వైఖరి మాదిరిగా మిత్రదేశాలను బెదిరించడం కంటే సహకరించడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు బైడెన్ అభిప్రాయపడ్డారు.

కానీ, వాణిజ్యం, మేధో సంపత్తి, బలవంతపు వాణిజ్య పద్ధతుల విషయంలో మాత్రం ట్రంప్ కఠినమైన మార్గాన్నే తానూ కొనసాగిస్తానని చెప్పారు.

ఇరాన్‌పై, ఒబామాతో తాను పర్యవేక్షించిన మల్టీ నేషనల్ అణు ఒప్పందానికి అనుగుణంగా ఉంటే టెహ్రాన్‌‌పై ఆంక్షలు ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు బైడెన్ తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం అంత సులభం కాదనే చెప్పాలి.

నాలుగు ఏళ్లుగా యూరప్, మిడిల్ ఈస్ట్ సహా ఇతర దేశాలు అమెరికా విదేశాంగ విధానాలను భరించాయి. ఒకప్పుడు ట్రంప్ అమెరికా దళాలతో సిరియా వంటి మిత్రదేశాలను భయాందోళనలకు గురిచేశారు.



దాంతో పుతిన్, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఇస్లామిస్ట్ యోధులకు మిత్రదేశమైన అమెరికా ఖ్యాతిని దిగజార్చేలా చేసింది. బిడెన్.. మిత్రదేశాలకు తన స్నేహా హస్తాన్ని అందించే యోచనలో ఉన్నారు.

సాంప్రదాయ పొత్తులను అణగదొక్కే యుఎస్ విదేశాంగ విధాన వ్యూహాన్ని అమెరికన్ మిత్రదేశాలు భరించాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని కొత్త అధ్యక్షుడిగా ఎదుర్కొని నిలవడం అనేది బైడెన్‌కు సవాల్ గానే చెప్పాలి.

టర్కీ అధ్యక్షుడు Recep Tayyip Erdogan కూడా బిడెన్‌కు కొత్త సవాలుగా మారనున్నాడు. Erdogan.. సిరియా, లిబియా, అర్మేనియాలో విభేదాలను రేకెత్తిస్తున్నాడు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గ్రీస్, ఫ్రాన్స్‌తో కలిసి కవ్వింపులకు పాల్పడుతున్నాడు.



టర్కీ నేత Erdogan.. రష్యన్ ఆయుధాలను కొనుగోలు చేసి నాటో కూటమిని దెబ్బతీశాడు. అమెరికా మిడిల్ ఈస్ట్, యూరోపియన్ మిత్రదేశాల ప్రయోజనాలపై దాడులకు మద్దతు పలికాడు.

రాబోయే నాలుగు ఏళ్లలో మిత్రదేశాలతో బైడెన్ సంబంధాలను ఎలా కొనసాగిస్తారనేది చూడాలి. ఇరాన్‌పై ట్రంప్ కఠినంగా వ్యవహరించడం గల్ఫ్ మిత్రదేశాలకు బలంగా మారింది.

కానీ ట్రంప్ చర్యలతో యుద్ధాన్ని ప్రేరేపించవచ్చనే ఆందోళనలు మిత్రులను ఇరాకటంలో పడేశాయి. మాస్కో, బీజింగ్‌తో సంబంధాలను మరింత పెంచాయి. చైనాతో ఎదురయ్యే దీర్ఘకాలిక ముప్పును బైడెన్ ఎదుర్కోవడమే కాదు.. ఇప్పుడు డ్రాగన్‌ను అమెరికా స్థిరమైన దీర్ఘకాలిక భాగస్వామిగా మిత్రదేశాలను బైడెన్ ఒప్పించాల్సి ఉంటుంది.



వచ్చే ఏడాదిలో అధ్యక్ష పదవిని స్వీకరించే సమయానికి ప్రపంచాన్ని తాను కోరుకున్న మార్గంలో నిలబెట్టడానికి బైడెన్ వ్యూహాప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

అంతేకాదు.. మిత్ర దేశాలను సైతం తన వెంట నిలబడేలా చేయాలంటే అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందే.. వాస్తవానికి ఇది చాలా కష్టమనే చెప్పాలి.

ఇరాన్‌ను కొత్త మల్టీ నేషనల్ అణు ఒప్పందంలో చేర్చాలనే తన ప్రణాళికను ఎలా విజయవంతం అవుతారు? అసలు ఒప్పందాన్ని రూపొందించడానికి యుఎస్‌కు మద్దతు ఇవ్వడానికి యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌లను బిడెన్ ఎలా ఒప్పించగలడు? ఒబామా 2015లో చేసినట్లుగా, బైడెన్ రష్యా, చైనాలను మళ్లీ తన వైపుకు తిప్పుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.



తాను కోరుకున్న విధంగా అమెరికాపై అంతర్జాతీయ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు.. ప్రపంచాన్ని తాను కోరుకున్న విధంగా రీసెట్ చేయడం కష్టమని బైడెన్ భావించవచ్చు.

వైట్‌హౌస్‌‌లో అధ్యక్ష పదవిలో కొన్ని వారాల పాటు కొనసాగిన తర్వాత ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ట్రంప్ చర్యలతో అమెరికాపై తగ్గిన విశ్వాసాన్ని నింపేందుకు ఒబామా యుగం తరహా నిర్ణయాలను అమలు చేస్తారో లేదో చూడాలి.