వాట్సప్ కొత్త రికార్డు : 5 బిలియన్లకు పైగా ఇన్‌స్టాల్స్‌

  • Published By: chvmurthy ,Published On : January 19, 2020 / 02:11 PM IST
వాట్సప్ కొత్త రికార్డు :  5 బిలియన్లకు పైగా ఇన్‌స్టాల్స్‌

టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్న ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్  ఫోన్లోనే అన్ని వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారు. ఇంక ఇందులో ఉన్న ఫీచర్లు, యాప్ ల గురించి ఐతె చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్లలో ఉండే  ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో 5 బిలియన్ల‌ డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకున్న రెండో నాన్‌ గూగుల్‌ యాప్‌గా రికార్డు సృష్టించింది. 

స్టాటిస్టా అనే కంపెనీ అందించిన సమాచారం మేరకు… వాట్సాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1.6 బిలియన్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉండగా, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌కు 1.3 బిలియన్ల మంది, వీచాట్‌కు 1.1 బిలియన్ల మంది మంత్లీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. 

ఇక ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అత్యధికమంది ఉపయోగిస్తున్న సోషల్‌ నెట్‌వర్క్‌ యాప్‌గా వాట్సాప్‌ రికార్డు సృష్టించింది. ఇక దక్షిణ కొరియాలో కేవలం 2019లోనే వాట్సాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య 56 శాతం వరకు పెరగడం విశేషం.