కరోనా వ్యాక్సిన్ పంపిణీ అసమానతలపై WHO అసంతృప్తి: ధనిక, పేద దేశాల మధ్య తేడా చూపించటం సరైందికాదు..

కరోనా వ్యాక్సిన్ పంపిణీ అసమానతలపై WHO అసంతృప్తి: ధనిక, పేద దేశాల మధ్య తేడా చూపించటం సరైందికాదు..

WHO Director Comments on Corona Vaccine Distribution : కరోనా వ్యాక్సిన్ పంపిణీలో జరుగుతున్న అసమానతలపై WHO ఆందోళన వ్యక్తంచేసింది. “వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి” అని ధనిక దేశాలు అనుకోవటం సరైంది కాదని..ధనిక దేశాలకు 39 మిలియన్ల డోసులు అందితే అదే ఓ పేద దేశానికి 25 డోసులే అందటం సరైంది కాదని వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ ను దక్కించుకున్న దేశాలు వారి దేశంలోని యువతకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారు.కానీ పేద దేశాల్లో మాత్రం బాధితులకు కూడా వ్యాక్సిన్ వేయించుకోలేని పరిస్థితి ఉందని.. WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందాలనే హామీ ప్రమాదంలో పడింది. వ్యాక్సిన్ మాకే దక్కాలనే ధనిక దేశాల ఆలోచన మంచిది కాదనీ..ఇది సరైంది కాదనీ అన్నారు. ప్రాణాలు అందరికీ ఒక్కటేననే విషయం ధనిక దేశాల ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు వ్యాక్సిన్లు రంగప్రవేశం చేశాయి. అయితే కరోనా టీకాల పంపిణీలో అసమానతలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఆవేదన వ్యక్తం చేశారు. 49 ధనిక దేశాలకు 39 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందితే ఒక పేద దేశానికి కేవలం 25 డోసులే అందాయని విచారం వెలిబుచ్చారు. ధనిక దేశాల్లో యువతకు కూడా కరోనా వ్యాక్సిన్ అందుతోందని ఇది సరైంది కాదని అన్నారు.

“వ్యాక్సిన్ మాకే ముందు దక్కాలి” అనే ధనిక దేశాల వైఖరి ఉందనే పద్ధతిని తీవ్రంగా తప్పుబట్టారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ధనిక దేశాల తీరు చూస్తే ప్రపంచం దారుణమైన రీతిలో నైతిక వైఫల్యం అంచున నిలిచినట్టుగా అనిపిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను కూడా విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా టీకాకు ఆమోదం కోసం డబ్ల్యూహెచ్ఓకు డేటా సమర్పించేందుకు బదులు, ధనిక దేశాల్లో రెగ్యులేటరీ వ్యవస్థల వెంబడి అత్యవసర వినియోగం అనుమతుల కోసం వెంపర్లాడుతున్నాయని ఆరోపించారు.

ప్రపంచంలో అందరికీ సమాన ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ అందించాలన్న హామీ ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడిందని టెడ్రోస్ అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో జనరల్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రీసియస్ ఈ వ్యాఖ్యలు చేశారు.