Jammu Kashmir Map: కాశ్మీర్ ను వేరే రంగు, దేశాల మధ్య చూపించిన WHO

భారత్ భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రంగులు మార్చి చూపించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా మ్యాప్ లను ముదురు నీలం, లేత నీలం రంగుల్లో చూపించగా.. భారత మ్యాప్ ను నీలం రంగులో

Jammu Kashmir Map: కాశ్మీర్ ను వేరే రంగు, దేశాల మధ్య చూపించిన WHO

Who

Jammu Kashmir Map: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO భారత చిత్రపఠంలో మార్పులు చేసి చూపించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అయింది. భారత్ భూభాగంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలను రంగులు మార్చి చూపించారు. పక్కనే ఉన్న పాకిస్తాన్, చైనా మ్యాప్ లను ముదురు నీలం, లేత నీలం రంగుల్లో చూపించగా.. భారత మ్యాప్ ను నీలం రంగులో చూపించారు. అయితే భారతావనికి తలకట్టుగా ఉన్న జమ్మూకాశ్మీర్లోని పలు అంతర్ భాగాలను బూడిద రంగులో చూపించింది WHO. దీనిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ లోనే ఈ మ్యాప్ లపై WHO దృష్టికి తీసుకెళ్లింది. అయితే దీనిపై WHO అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు లేదు.

Also Read: Business News: దేశంలో 7 లక్షల కారు ఆర్డర్లు పెండింగ్

ఈ విషయంపై విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అడిగిన ప్రశ్నకు భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ సోమవారం నాడు పార్లమెంటులో స్పందిస్తూ.. విషయాన్ని WHOతో చర్చించినట్లు వివరించారు. జెనీవాలో వివరించినట్లుగా.. భారత శాశ్వత లక్ష్యాన్ని(PoKను భారత్ లో విలీనం) కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు WHO ఒక ప్రకటనలో పేర్కొందని.. దాని ప్రకారం.. సంబంధిత సరిహద్దులు ఇంకా అంతర్జాతీయంగా ఆమోదంగానీ.. ఆయా దేశాలు సొంతం చేసుకున్నట్లుగా గానీ తాము చూపలేదంటూ WHO ప్రకటనను వీ.మురళీధరన్ సభకు తెలియజేసారు. “సరిహద్దుల డీలిమిటేషన్ గురించి WHO యొక్క ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేదని.. మ్యాప్‌లలో చుక్కలు మరియు గీతలు ఉన్న పంక్తులు సుమారుగా ఆయా దేశాల సరిహద్దు రేఖలను మాత్రమే సూచిస్తాయని, వీటికి ఇంకా పూర్తి ఒప్పందం ఉండకపోవచ్చని” WHOకు చెందిన వెబ్ సైట్లో ఉంచినట్లు మురళీధరన్ వివరించారు. అయితే అసలు భారత్ సరిహద్దులను రంగు మార్చి చూపించాల్సిన అవసరం ఏమొచ్చిందనే విషయాన్ని WHO వివరించలేకపోయింది.

Also read: Canada PM trolled” “కర్మ అనుభవించక తప్పదు” కెనడా ప్రధానిపై భారతీయుల ట్రోలింగ్

అంతకుముందే ఈ విషయాన్నీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శాంతను సేన్ కూడా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. జమ్మూకాశ్మీర్ లోని పలు భాగాలను WHO రంగు మార్చి చూపించిందని.. ఆయా మ్యాప్ లపై క్లిక్ చేసినప్పుడు పాకిస్తాన్, చైనాకు సంబందించిన కోవిడ్ వివరాలు వస్తున్నట్లు శాంతను సేన్ పేర్కొన్నారు.


Also read: TATA Nexon EV: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా సరికొత్త రికార్డు