TATA Nexon EV: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా సరికొత్త రికార్డు

రెండేళ్లలో 13500లకు పైగా "టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల"ను డెలివరీ చేసినట్లు సంస్థ ప్రకటించింది. 730 రోజుల్లో రోజుకి సరాసరి 18కి పైగా విద్యుత్ కార్లను వినియోగదారులు కొనుగోలు చేశార

TATA Nexon EV: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా సరికొత్త రికార్డు

Tata Nexon

TATA Nexon EV: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్.. తమ ఎలక్ట్రిక్ వాహన అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. రెండేళ్లలో 13500లకు పైగా “టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ల”ను డెలివరీ చేసినట్లు సంస్థ ప్రకటించింది. వినియోగదారులు ఇంధన ఆధారిత కార్లను వదిలి వడివడిగా ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో.. కేవలం రెండేళ్లలోనే రికార్డు అమ్మకాలు నమోదుకావడం పట్ల టాటా సంస్థ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. 730 రోజుల్లో రోజుకి సరాసరి 18కి పైగా విద్యుత్ కార్లను వినియోగదారులు కొనుగోలు చేసినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో టాటా సంస్థ పేర్కొంది.

Also Read: BJP OBC Morcha: వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ తాపత్రయం: కే. లక్ష్మణ్

ప్యాసెంజర్ వాహనాల్లో దేశీయంగా ఇప్పుడిపుడే విద్యుత్ కార్లకు గిరాకీ ఏర్పడుతుంది. దీంతో ఆ మార్కెట్ వాటాను చేజిక్కించుకునేందుకు కార్ల సంస్థలు పోటీపడుతున్నాయి. అయితే బడ్జెట్ సెగ్మెంట్ లో విద్యుత్ వాహనాలేవి వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం .. ఇతర కార్ల తయారీ సంస్థల నుంచి పోటీ లేకపోవడంతో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ కు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం దేశీయ సంస్థలైన మహీంద్రా, టాటాలే విద్యుత్ వాహనాలను తయారు చేస్తున్నాయి. అయితే పరిమితంగా ఉన్న ఛార్జింగ్ సౌకర్యాలు, వనరుల లేమి కారణంగా విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సంకోచిస్తున్నారు.

Also read:Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు

నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ ప్రత్యేకతలు
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. “పర్మనెంట్ సింక్రోనస్ మాగ్నెట్ ఇండక్షన్ మోటార్” కలిగిఉన్న ఈకారు..30.2kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 125బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంటిలో ఉండే సాధారణ ఛార్జింగ్ సదుపాయంతో ఈ కారును ఛార్జ్ చేసేందుకు 8.30గంటల సమయం పడుతుండగా.. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా గంటలో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. 9.14 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 312 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. రానున్న రోజుల్లో ఛార్జింగ్ ను వేగవంతం చేసి.. మరింత మైలేజ్ ఇచ్చే విధంగా ఈకారును అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఇక కారు లోపల అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు ఉన్న ఈ టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.13.99 లక్షలు(Ex-Showroom)గా ఉంది.

Also read: Covid Rules Ignored: పాలకులే ఇలా ఉంటే ఎలా? పార్లమెంట్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన