Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు

గర్భిణీ అయిన ఒక విదేశీ మహిళకు తాలిబన్లు ఆశ్రయం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆశ్రయం ఇవ్వడం తమ ఆచారాలకు విరుద్ధమేనన్న తాలిబన్ అధికారులు.. బెల్లిస్ కు ఒక షరతు విధించారు.

Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు

Bellis

Pregnant Woman: “తాలిబన్లు” ఈ పేరువింటేనే.. ఘోరాలు, వికృతచేష్టలు, అన్నిటికి మించి మహిళలపై అకృత్యాలు వంటి విషయాలు గుర్తుకువస్తాయి. అటువంటి తాలిబన్లు ఒక గర్భణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన ఘటన జనవరి 30న వెలుగులోకి వచ్చింది. మతవిశ్వాసాలను ప్రజలపై రుద్దుతూ, ప్రజల స్వేచ్ఛను హరించే తాలిబన్లు గతేడాది అఫ్ఘానిస్తాన్ దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాలిబన్ల వశమైన నాటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లో యదేశ్చగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుంది. షరియా ఇస్లాం చట్టాలను అమలు చేసి.. ప్రజల స్వేచ్ఛను హరించివేస్తున్నారు. ఇక మహిళలు, బాలికల పట్ల తాలిబన్లు చూపుతున్న వివక్ష అంతాఇంతా కాదు. షరియా చట్టాల ప్రకారం ఆడవారు బయటకు రాకూడదంటూ తాలిబన్లు హుకుం జారీ చేశారు. తాలిబాన్లకు బయపడి మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.

Also read: Covid Rules Ignored: పాలకులే ఇలా ఉంటే ఎలా? పార్లమెంట్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

అటువంటిది.. గర్భిణీ అయిన ఒక విదేశీ మహిళకు తాలిబన్లు ఆశ్రయం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ కు చెందిన..షార్లెట్ బెల్లిస్ అనే మహిళా విలేకరి..ఖతార్ దేశంలోని ఒక ప్రముఖ మీడియా ఛానల్ కోసం పనిచేస్తుంది. ఈక్రమంలో అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితులపై కవరేజి చేసుకురావాలంటూ గతేడాది చివరలో బెల్లిస్ ను పంపించింది సదరు మీడియా యాజమాన్యం. సహచర భాగస్వామి “జిం”తో కలిసి అఫ్ఘానిస్తాన్ చేరుకున్న బెల్లిస్.. అక్కడ తాలిబన్ల గురించి, మహిళల గురించి రిపోర్ట్ చేసింది. అనంతరం ఖతార్ లోని దోహాలో ఉన్న తమ కార్యాలయానికి చేరుకుంది. అక్కడికి చేరుకోవడంతోనే తాను గర్భవతినని గ్రహించిన షార్లెట్ బెల్లిస్..సహచర భాగస్వామితో సహా న్యూజీలాండ్ కు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే కరోనా మూడో దశను అరికట్టేందుకు న్యూజిలాండ్ లో కఠిన లాక్ డౌన్ అమలు చేశారు. విదేశీయులే కాదు, ఆ దేశ పౌరులు సైతం ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ న్యూజిలాండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో తన సొంత దేశానికి చేరుకునేందుకు ఉన్న ఒక్క అవకాశం కోల్పోయింది బెల్లిస్.

Also read: Narayana Swamy : మీకు ప్రభుత్వ జీతం కావాలి.. మీ పిల్లలకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లు వద్దా?

అయితే ఇక్కడ విషయం ఏంటంటే షార్లెట్ బెల్లిస్ కు, జింకు ఇంకా పెళ్ళికాలేదు. తనకు కాబోయే జీవిత భాగస్వామితో కలిసి న్యూజిలాండ్ లో నివసించేది. గర్భం దాల్చిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న బెల్లిస్..దోహాలోనే ఉండేందుకు అక్కడి అధికారులను కోరింది. అయితే.. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన మహిళలకు తాము ఆశ్రయం కల్పించలేమంటూ ఖతార్ దేశ అధికారులు బెల్లిస్ విజ్ఞప్తిని తిరస్కరించారు. దీంతో అటు సొంత దేశం న్యూజిలాండ్, ఇటు పనిచేస్తున్న దేశం ఖతార్ లో ఉండలేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది బెల్లిస్. బెల్లిస్ కు అఫ్ఘానిస్తాన్ వర్క్ వీసా ఉండడంతో వారిద్దరూ అక్కడి తాలిబన్ ఉన్నతాధికారులతో మాట్లాడి నాలుగు నెలల పాటు ఆశ్రయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బెల్లిస్ పరిస్థితిని అర్ధం చేసుకున్న తాలిబన్లు.. ఆమెకు ఆమె భర్తకు సురక్షితమైన ఆశ్రయం కల్పించారు. పెళ్ళికాకుండా తల్లైన మహిళలకు ఆశ్రయం ఇవ్వడం తమ ఆచారాలకు విరుద్ధమేనన్న తాలిబన్ అధికారులు.. బెల్లిస్ కు ఒక షరతు విధించారు. బయట తిరిగే సమయంలో ఎవరైనా ప్రశ్నిస్తే పెళ్లయిందని చెప్పాలని ఆ షరతు సారాంశం. బెల్లిస్ కు, తన సహచర భాగస్వామి ఉండేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు.

Also read: Snow Strom : రక్తం గడ్డకట్టే చలి..కదల్లేక శవంలా పడి ఉంటున్న మూగజీవాలు

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అఫ్ఘానిస్తాన్ లో పరిస్థితులు అస్సలు బాగోలేదు. ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు సరికదా..గర్భిణీలకు ప్రత్యేక మహిళా డాక్టర్లు లేరు, మందులు కూడా లేవు. దీంతో ఈ విషయాలన్నింటిని పత్రాల రూపంలో పొందుపరిచిన బెల్లిస్.. తమ పరిస్థితి అర్ధం చేసుకుని న్యూజిలాండ్ లోకి అనుమతించాలంటూ అక్కడి అధికారులను వేడుకొంది. బెల్లిస్ పరిస్థితిని అర్ధం చేసుకున్న న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు.. తాము అనుమతిచ్చినా.. ఇప్పుడు దేశంలోకి అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారంటూ మరో పిడుగు లాంటి వార్త చెప్పారు. దీంతో తన పరిస్థితిని వివరిస్తూ షార్లెట్ బెల్లిస్ ” న్యూజీలాండ్ హెరాల్డ్” పత్రికకు ఒక ఇంటర్వ్యూ పంపించింది. “ఇప్పటి వరకు మహిళలు, ఆడపిల్లల హక్కులు, మానవహక్కులపై అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లను ప్రశ్నించానని.. అదే ప్రశ్న తన సొంత దేశ అధికారులను అడగాల్సి వస్తుందని తానూహించలేదంటూ షార్లెట్ బెల్లిస్ ఆవేదన వ్యక్తం చేసింది. గర్బవతిననే కనికరంలేకుండా..చట్టాలపేరుతో సొంత మనుషులనే దూరం పెట్టె న్యూజీలాండ్ వంటి దేశాలు వారి చట్టాలను మరోసారి పునఃసమీక్షించుకోవాలని విమర్శలను గుప్పించింది.

Also read: Financial Survey: ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ విషయాలివే

ఇదిలాఉంటే..జనవరి చివరి వారంలో న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్ అధికారులు బెల్లిస్ విజ్ఞప్తిపై స్పందించారు. 10 రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండేందుకు అంగీకరిస్తే న్యూజిలాండ్ కు రావొచ్చంటూ బెల్లిస్ చెప్పిందని హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. అయితే బెల్లిస్.. హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూపై విమర్శలు కూడా వస్తున్నాయి. అఫ్గానిస్తాన్ ప్రజలపై తాలిబన్లు అరాచకం చేస్తుంటే.. వారిలో మీరు ఈ శాంతి గుణాన్ని ఎలా చూశారంటూ పలువురు విమర్శిస్తున్నారు.