Financial Survey: ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ విషయాలివే

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు.

Financial Survey: ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ విషయాలివే

Andhra Pradesh

Financial Survey: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్‌సభలో సమర్పించారు. దేశం మొత్తానికి సంబంధించి చేపట్టిన సర్వేలో.. ఆంధ్రప్రదేశ్ సంబంధిత అంశాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ముందంజలో ఉంది. 72స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉండగా.. కేరళ 75స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది.

ఆంధప్రదేశ్ లైఫ్ బిలో వాటర్ కేటగిరీలోనూ ఫ్రంట్ రన్నర్ రాష్ట్రంగా పేరు తెచ్చుకుంది.

Read Also: గర్భిణీలను ఎస్బీఐ ఉద్యోగాల్లోకి తీసుకోదట

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)కింద 2020-21లో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సేవా రంగంలో స్వల్పంగా వెనుకబడింది.

పంటమార్పిడి కార్యక్రమంలో భాగంగా పొగాకుకు ప్రత్యామ్నాయ పంట సాగుగా వ్యవహరిస్తోంది. ఏపీతో సహా బీహార్, గుజరాత్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో 2021-22 నుంచి దీనిని అమలు చేస్తున్నారు.

మహమ్మారి కంటే ముందు నాటి పరిస్థితులతో పోల్చితే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయించే పనుల శాతం ఏపీలో తగ్గుముఖం పట్టాయి.

ఏపీలో సంతానోత్పత్తి రేటు.. 2015-16లో 1.8 ఉండగా, 2019-21లో 1.7కు తగ్గిపోయింది. ఏపీలో స్త్రీ, పురుష నిష్పత్తిలో కాస్త వృద్ధి కనిపించింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు గతంలో 914 ఉండగా, ఇప్పుడు 934 మంది స్త్రీలకు పెరిగారు.