Narayana Swamy : మీకు ప్రభుత్వ జీతం కావాలి.. మీ పిల్లలకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లు వద్దా?

ప్రభుత్వం నుంచి వేలు, లక్షలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారని మంత్రి అన్నారు. మీరు పాఠాలు చెప్పే స్కూల్స్‌లో మీ పిల్లలను ఎందుకు చదివించరు

Narayana Swamy : మీకు ప్రభుత్వ జీతం కావాలి.. మీ పిల్లలకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లు వద్దా?

Narayana Swamy

Narayana Swamy : ప్రభుత్వం జారీ చేసిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, టీచర్లు ఆందోళన బాటపట్టిన సంగతి తెలిసిందే. రోడ్డెక్కిన ఉద్యోగులు, టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఉద్యోగులు.. సమ్మె నోటీసు కూడా ఇచ్చిన విషయం విదితమే.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

ఈ క్రమంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైన వృత్తి అని చెప్పిన మంత్రి.. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? అని మండిపడ్డారు. సీఎం జగన్ గురించి టీచర్స్ వాడిన భాష సరైంది కాదన్నారు. టీచర్ల పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వేలు, లక్షలు జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారని మంత్రి అన్నారు.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

మీరు పాఠాలు చెప్పే స్కూల్స్ లో మీ పిల్లలను ఎందుకు చదివించడం లేదని మంత్రి అడిగారు. టీచర్లు తమ సమస్యలను ముఖ్యమంత్రిని కలిసి చెబితే సరిపోయేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే చర్చలు జరిపి పరిష్కరించుకోవాలన్నారు. అలా రోడ్డెక్కి నిరసనలు తెలపడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని మంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపైనా మంత్రి స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెబితే కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి నారాయణ స్వామి అన్నారు.

కొన్ని రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య పీఆర్సీ వివాదం నడుస్తోంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పీఆర్సీ జీవోలతో తమకు అన్యాయం జరుగుతుందనేది ఉద్యోగుల వాదన. కొత్త పీఆర్సీ వలన ప్రభుత్వంపై సుమారు రూ.10,500 కోట్ల మేర అదనపు భారం పడుతోందని అలాంటప్పుడు జీతాలు ఎలా తగ్గుతాయనేది ప్రభుత్వ వర్గాల వాదన. తమ డీఏలు, హెచ్ఆర్ఏ, పాత బకాయిలు కలపడం వలనే తమకు జీతం పెరిగిందని ప్రభుత్వం ప్రచారం చేస్తుందని.. అవి తమకు రావలసిన బకాయిలు మాత్రమే అనేది ఉద్యోగుల వాదన. తాము అడుగుతున్నట్లు పాత విధానంలోనే తమ జీతాలు చెల్లిస్తే వారి లెక్కల ప్రకారమే ప్రభుత్వంపై పడిన రూ.10,500 కోట్ల భారం తగ్గుతుంది కదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో పీఆర్సీ వివాదం ముదురుతోంది. ఈ విషయంలో ఇటు ప్రభుత్వం కానీ.. అటు ఉద్యోగులు కానీ వెనక్కి తగ్గడం లేదు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం పట్టుబడుతుంటే.. ఉద్యోగులు మాత్రం ససేమిరా అంటున్నారు.

పైగా వార్డు వాలంటీర్ల సాయంతో ఇంటింటికి తిరిగి తమపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. చర్చల పేరుతో తమని పదే పదే పిలిచి అవమానించడమే కాక కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, సమస్యలను ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి అంటూ తమ హెచ్ఆర్ఏ, డీఏలను తగ్గించారని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడిందని తెలిపారని, తమ జీతాలు పెంచమంటే మాత్రం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదంటూ.. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు.