Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

చేపల్లోని ప్రొటీన్, కొవ్వు అమ్లాలు రక్తపోటు తగ్గటానికి దోహదపడతాయి. తద్వారా పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

Fish Curry

Fish : చేపల్ని వారానికి ఓసారై వంటల్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే సాధారణంగా మన శరీరానికి ప్రతిరోజు ప్రొటీన్ తగినంత మోతాదులో అవసరఅవుతుంది. ఇది చేపల వంటి సముద్రపు ఆహారం నుండి లభిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. చేపల నుండి లభించే ప్రొటీన్ వల్ల పక్షవాతం ముప్పు తగ్గుతున్నట్లు ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది.

మనిషికి అసలు రోజువారిగా ఎంత ప్రొటీన్ కావాలన్న విషయానికి సంబంధించి మగవారికి రోజుకు 56 గ్రాములు, మహిళలకు రోజుకు 46 గ్రాముల ప్రొటీన్ అవసరం. ఈ మోతాదులకు అదనంగా రోజుకు 20 గ్రాముల ప్రొటీన్ తీసుకుంటే పక్షవాతం ముప్పు 30శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మాసం, ధాన్యం నుండి లభించే ప్రొటీన్ కన్నా చేపల ద్వారా లభించే ప్రొటీన్ తో శరీరానికి మరింత రక్షణ లభిస్తుందట.

చేపల్లోని ప్రొటీన్, కొవ్వు అమ్లాలు రక్తపోటు తగ్గటానికి దోహదపడతాయి. తద్వారా పక్షవాతం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. చేపలు తినటంవల్ల శరీరంలోని వ్యర్థమైన కొవ్వు తగ్గిపోతుందని.. తద్వారా మెరిసే మేనిఛాయతో పాటు బరువు తగ్గుతారు. నాజూగ్గా తయారవుతారు. ఇంకా చేపల్ని తీసుకుంటే శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అందుతాయి. చర్మం నిగారింపును సంతరించుకోగా, వెంట్రుకలు మృదువుగా తయారవుతాయి.

చేపల్ని తినటం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. దీంతోపాటు గుండె సంబంధిత జబ్బులను 36 శాతం మేరకు తగ్గించుకోవచ్చు. చేపలు తినడం వలన అల్జీమర్స్ వ్యాధి, మానసికపరమైన ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వారానికి ఒకమారు తప్పకుండా చేపల కూరను ఇష్టంగా తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.