Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనావైరస్ అనేక రకాలుగా మ్యుటేషన్లు అవుతూ రోజుకో కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకుస్తున్నాయి.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

Covid Hiv Patient Covid Inf

Covid HIV Patient : ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనావైరస్ అనేక రకాలుగా మ్యుటేషన్లు అవుతూ రోజుకో కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకుస్తున్నాయి. దాదాపు రెండేళ్లకు పైగా ఈ కొవిడ్ ప్రపంచాన్ని తన కోరల్లో బంధించింది. కరోనా వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ మరణాల సంఖ్య తగ్గినప్పటికీ.. కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారినపడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనావైరస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు అధ్యయనాల్లోనూ పరిశోధకులు గుర్తించారు.

హెచ్ఐవీ (HIV) వ్యాధిగ్రస్తుల్లోనూ కరోనావైరస్ దీర్ఘకాలిక లక్షణాలు ఉంటున్నట్టుగా ఇటీవలి అధ్యయనంలో సైంటిస్టులు గుర్తించారు. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడేవారిలో కరోనా మ్యుటేషన్లు అయ్యే అవకాశం అధికంగా ఉంటుందని కొత్త అధ్యయనంలో రుజువైంది. అధ్యయనం ప్రకారం.. దక్షిణాఫ్రికాకు చెందిన 22ఏళ్ల మహిళ HIVతో బాధపడుతోంది. అయితే ఆమెకు కరోనా సోకడంతో 9 నెలలుగా వైరస్‌తో పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో ఆమె శరీరంలో శ్వాసకోశ వైరస్ కనీసం 21 మ్యుటేషన్లను అభివృద్ధి చేసిందని పరిశోధకుల బృందం గుర్తించింది.

హెచ్ఐవీ చికిత్సతో బలమైన రోగనిరోధకత.. 
22 ఏళ్ల హెచ్‌ఐవి బాధితురాలు (anti-retroviral medication) మందులు వాడుతోంది. హెచ్ఐవీ చికిత్స మందులు దీర్ఘకాలికంగా తీసుకోవడం కారణంగా ఆమెలో రోగనిరోధక వ్యవస్థ బలపడిందని పరిశోధకులు నిర్ధారించారు. అందుకే 6 నుంచి 9 వారాల్లోనే ఆమె కరోనా ప్రభావాన్ని అధిగమించగలిగిందని చెబుతున్నారు. Stellenbosch యూనివర్శిటీ, University of KwaZulu-Natal శాస్త్రవేత్తల నేతృత్వంలోని అధ్యయనంలో ఈ విషయం రుజువైంది. అయితే ఈ అధ్యయనాన్ని పూర్తిస్థాయిలో సమీక్షంచలేదు.

హెచ్‌ఐవితో బాధితులు చికిత్స తీసుకోని వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారిలో కరోనావైరస్ వేగంగా మ్యుటేషన్ చెందుతుందని అధ్యయనంలో రుజువైంది. ఇలాంటి బాధితుల్లో కరోనా కొత్త
మ్యుటేషన్ల అభివృద్ధికి దారితీయవచ్చు. హెచ్ఐవీ బాధితురాలికి కరోనా బీటా వేరియంట్ సోకిందని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.

దక్షిణాప్రికాలో ఒమిక్రాన్ (Omicron Variant) మాదిరిగానే ఈ బీటా (Beta Variant)  వేరియంట్ కనుగొన్నారు. ఈ హెచ్ఐవి బాధిత కేసు ఆధారంగా పరిశీలిస్తే.. మునుపటి మాదిరిగానే, కొత్త మ్యుటేషన్ల ఆవిర్భావానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే అందుకు సమర్థవంతమైన యాంటీ రెట్రోవైరల్ ట్రీట్‌మెంట్ ఎంతో కీలకమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాఫ్రికాలోనే అత్యధికంగా HIV బాధితులు :
ప్రపంచంలోనే అత్యధికంగా హెచ్‌ఐవీ బాధితులు ఒక్క దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. 60 మిలియన్ల మందిలో 8.2 మిలియన్ల మంది ఈ HIV వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ బారినపడ్డవారిలో రోగనిరోధక శక్తిని క్రమంగా బలహీనపడిపోతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ క్రమంలోనే హెచ్ఐవి బాధితుల్లో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోందని అధ్యయనంలో గుర్తించారు సైంటిస్టులు.

హెచ్ఐవి బాధితురాలికి కూడా కరోనావైరస్ వ్యాపించిందని, అయితే ఆమె శరీరంలోకి ప్రవేశించిన కరోనా స్పైక్ ప్రోటీన్‌పై కనీసం 10 మ్యుటేషన్లను అభివృద్ధి చేసిందని గుర్తించారు. శరీరంలో ఇది కణాలతో బంధించడానికి మరో 11 ఇతర మ్యుటేషన్లను అనుమతిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

సాధారణంగా Omicron వేరియంట్, lambda (లాంబ్డా) వేరియంట్లలో కొన్ని మార్పులు కనిపించగా.. కొన్ని వైరస్ మ్యుటేషన్లు మాత్రం యాంటీబాడీలు క్షీణించేలా అత్యధిక స్థాయిలో ప్రభావితం చేస్తాయని పరిశోధక అధ్యయనంలో కనుగొన్నారు.

Read Also :  NeoCoV Alert : ప్రపంచాన్ని కలవరపెట్టే ఈ కొత్త NeoCoV వైరస్‌పై ఆందోళనే వద్దు.. ఎందుకంటే? ఈ ఒరిజినల్ స్టడీ చదవాల్సిందే..!