Covid Rules Ignored: పాలకులే ఇలా ఉంటే ఎలా? పార్లమెంట్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

రాష్ట్రపతి ప్రసంగ సమయంలో సెంట్రల్ హాల్లో కూర్చున్న కేంద్రమంత్రులు, ఎంపీలు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఒక్కో సీటులో ఏడుగురు కూర్చొని మాస్కు లేకుండానే ఒకరితో మరొకరు ముచ్చటించుకున్నరు

Covid Rules Ignored: పాలకులే ఇలా ఉంటే ఎలా? పార్లమెంట్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

Parliament

Covid Rules Ignored: దేశంలో కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలంటూ ఓపక్క కేంద్ర ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే.. కేంద్రంలోని మంత్రులు, ఎంపీలే ఆ ప్రకటనలను విస్మరిస్తున్నారు. దేశ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మార్గనిర్దేశం చేయాల్సిన పార్లమెంటు భవనంలోనే ఎంపీలు, కేంద్ర మంత్రులు యదేశ్చగా కోవిడ్ నిభంధనలు ఉల్లంఘించడం విమర్శలకు తావిస్తుంది. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున.. అందుకనుగుణంగా పార్లమెంటు సిబ్బంది సమావేశాల్లో ఏర్పాట్లు చేశారు.

Also read: Drugs Crime: డ్రగ్స్ దందాకు పాల్పడేవారిపై ఇక చెడుగుడే: సైబరాబాద్ పోలీసుల “స్ట్రాంగ్ వార్నింగ్”

సమావేశాలకు వచ్చే నాయకులు భౌతిక దూరం పాటించే విధంగా కుర్చీలను, బెంచీలను దూరంగా వేశారు. అయితే సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. రాష్ట్రపతి ప్రసంగ సమయంలో సెంట్రల్ హాల్ లో కూర్చున్న కేంద్రమంత్రులు, ఎంపీలు కోవిడ్ నిబంధనలు పాటించలేదు. ఒక్కో సీటులో ఏడుగురు కూర్చొని, మాస్కు లేకుండానే ఒకరితో మరొకరు ముచ్చటించుకున్నారు. హాల్​లోని మొదటి రెండు వరుసల్లో కూర్చున్న ప్రధాని, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, మరికొందరు కేంద్ర మంత్రులు, నాయకులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించారు.

Also read: Botsa Satyanarayana: ఉద్యోగులతో దూరం పెరుగుతుందని సహనంతో ఉన్నాం: మంత్రి బొత్స

అయితే సెంట్రల్ హాల్​ మూడో వరుస నుంచి కూర్చున్న పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రం భౌతిక దూరం మరిచారు. పక్కపక్కనే కూర్చుంటూ ముచ్చటించుకున్నారు. కొన్ని వరుసల్లో ఒక్కో సీటులో ఏడుగురు ఎంపీలు కూర్చున్న దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు.. పాలకులే ఇలా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.

Also read: Rahul Gandhi : భారతీయులు చాలామంది మహిళలను మనుషులుగానే చూడడం లేదు..ఇది సిగ్గుచేటు: రాహుల్ గాంధీ