Snow Strom : రక్తం గడ్డకట్టే చలి..కదల్లేక శవంలా పడి ఉంటున్న మూగజీవాలు

రక్తం గడ్డకట్టే చలి.. మూగజీవాలు కదల్లేక శవంలా పడి ఉంటున్నాయి.ఫ్లోరిడా రాష్ట్రంలో శీతగాలుల ధాటికి ఇగ్వానస్‌ అనే ఊసరవెల్లి వంటి జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి.

Snow Strom : రక్తం గడ్డకట్టే చలి..కదల్లేక శవంలా పడి ఉంటున్న మూగజీవాలు

Snow Strom

US Snow Strom.. Iguanas Freeze : : ఉత్తర అమెరికా చలితో గజగజలాడిపోతోంది. మైనస్ డిగ్రీల చలి. రక్తం సైతం గడ్డకట్టిపోయే చలిగాలుల దెబ్బకి బిగుసుకుపోతోంది. దీనికి తోడు మంచు తుఫానులు వణికిస్తున్నాయి. దీంతో జనజీవనం మరింతగా స్థంభించి పోయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు స్నో అలర్ట్ ప్రకటించాయి. రోడ్ల మీదికి..రావాలంటే ప్రాణాలు పోతాయా అన్నంతగా భయపడిపోతున్నారు జనాలు. దీంతో జనాలు హీటర్లనే ఆశ్రయిస్తున్నారు. ఇంట్లో ఉండే మనుషులు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా భయపడే పరిస్థితి. మరి అడవుల్లోను..బహిరంగ ప్రదేశాల్లో జీవించే మూగ జీవాల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో కదా..కదులుదామన్నా కదల్లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి మూగజీవాలు. చలిగాలికి వణికిపోతున్నాయి. కదల్లేక చచ్చిన శవాల్లా పడి ఉంటున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఇగ్వానస్‌ అనే ఊసరవెల్లి వంటి జీవులు సజీవ శవాలుగా మారిపోతున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలో ఎక్కువగా కనిపించే ఈ జీవులు ఈ శీతాకాలంలో అక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకోలేకపోతున్నాయి. రక్తం గడ్డకట్టేంత చలిగాలులు వీస్తుండటంతో ఈ జీవులు ఫ్లోరిడాలో ఎక్కడ పడితే అక్కడ ప్రాణంతో ఉన్నా శవాల్లా పడిఉంటున్నాయి. దీంతో యూఎస్‌ వాతావరణ శాఖ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది.

Also Read : America: అమెరికాలో మంచు తుఫాను.. విమాన సర్వీసులు రద్దు

ఇగ్వానస్‌ శరీరంలో చల్లని రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఉష్ణోగ్రత్తలు మైనస్‌ 4 డిగ్రీల నుంచి మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటే ఇవి తట్టుకోలేవు. దీంతో ప్రస్తుతం అక్కడి పరిస్థితులకు పాపం ఈ మూగ జీవాలు ఎక్కడివక్కడే కదలలేని పరిస్థితిలో పడి ఉంటున్నాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ ఇగ్వానస్ జీవులు ఎక్కువగా కదల్లేవు. వాటి శరీరంలో ఉండే రక్తంలో ఉండే చల్లదనమే కారణం. అటువంటిది ప్రస్తుతం అక్కడి దారుణ శీతగాలుల ధాటికి తాళలేకపోతున్నాయి. చచ్చిన శవంలా ఎక్కడివక్కడే పడిపోయి ఉంటున్నాయి.

ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలో రోడ్ల మీద ఇళ్ల పక్కన, పార్కుల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ జీవులు చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ కాస్త వెచ్చదనం సోకితే చక్కగా కదులుతాయి. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్తితి అలాలేదు. భయంకరమైన శీతగాలుల ధాటికి ఇవి ఎక్కడివక్కడే పడి ఉంటున్నాయి. కానీ ఒక్క సారి ఉష్ణోగ్రత పెరిగితే ఇవి సాధారణ స్థితికి చేరుకుంటాయి. కాబట్టి వాటికి ఎటువంటి హానీ చేయవద్దని అధికారులు స్థానికులకు సూచిస్తున్నారు.

Also read : Narayana Swamy : మీకు ప్రభుత్వ జీతం కావాలి.. మీ పిల్లలకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లు వద్దా?

స్నో అలర్ట్‌ హెచ్చరికల క్రమంలో గత రెండు రోజుల నుంచి ఫ్లోరిడాలో అనేక ఆంక్షలు అమల్లో ఉన్నాయి. గత నాలుగేళ్లలో ఇటువంటి మంచు తుఫాన్ ఇప్పుడేనని చెబుతున్నారు. ఈ స్నో ఎఫెక్ట్ దెబ్బకు ఇప్పటికే వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేయబడ్డాయి. రహదారులు, రోడ్లు, పలు ప్రాంతాలు మంచుతో కప్పబడ్డాయి. అనేక రాష్ట్రాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప రోడ్లమీదకు రావద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.