BJP OBC Morcha: వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ తాపత్రయం: కే. లక్ష్మణ్

గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.

BJP OBC Morcha: వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ తాపత్రయం: కే. లక్ష్మణ్

Bjp Trs

BJP OBC Morcha: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించమని చెప్పడం కేసీఆర్ కు తగదని.. కేంద్ర ప్రభుత్వం.. మోదీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారని లక్ష్మణ్ అన్నారు. రాచరిక వ్యవస్థకు అలవాటు పడ్డ కేసీఆర్ కు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదని లక్ష్మణ్ విమర్శించారు.

Also Read: Ban on Rallies: ఎన్నికల సంఘం నిషేధం పొడగింపు.. వెయ్యి మందికి అనుమతి

2018లో ఇచ్చిన హామీలను కేసీఆర్ మరచిపోయాడని.. బయ్యారం పై గతంలో కేసీఆర్.. కేటీఆర్ లు ఇచ్చిన హామీ ఏమైందని ఈసందర్భంగా లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించారు. తెలంగాణలో సమస్యలపై అన్నివర్గాల ప్రజలు ఆందోళనకు సిద్ధమౌతున్నారన్న లక్ష్మణ్..ప్రజల అసహనాన్ని గుర్తించిన టీఆర్ఎస్ నేతలు తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు టీఆర్ఎస్ నేతలకు లేదని లక్ష్మణ్ అన్నారు. ప్రపంచ నాయకుల పై జరిపిన సర్వేలో 51శాతం మంది చైనా ప్రజలు మోదీ వైపు మొగ్గు చూపారని ఆయన అన్నారు.

Also read: Chandrababu : వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై గట్టిగా పోరాడాలి – చంద్రబాబు దిశానిర్దేశం

మిషన్ భగీరథను .. అవినీతికి కేరాఫ్ గా మార్చుకున్న తెలంగాణ మంత్రులు.. బీజేపీపై బావిలో కప్పల్లా అరుస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సజావుగా అమలైన “ఆయుష్మాన్ భారత్”.. తెలంగాణలో ఒక్కరికి కూడా ఉపయోగపడలేదంటే అది కేవలం కేసీఆర్ అలసత్వమేనని లక్ష్మణ్ విమర్శించారు. రైతుబందు పేరుతో రూ.16 వేల కోట్లు ఇచ్చి జబ్బలు చరచుకుంటున్న కేసీఆర్ సర్కారుకు..దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న లక్షల కోట్లు పెట్టుబడి సాయం కనిపించడంలేదా అని ప్రశ్నించారు. అమెరికా.. యూరప్ దేశాలకు సాధ్యంకాని స్వదేశీ కరోనా వ్యాక్సిన్, ఉచిత ఆహార పధకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు లక్ష్మణ్ వివరించారు.

Also read: Covid Rules Ignored: పాలకులే ఇలా ఉంటే ఎలా? పార్లమెంట్ లో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా మనం సొంతంగా స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుందామని గతంలో కేటీఆర్, కేసీఆర్ చేసిన ప్రకటన ఏమైందని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణలో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యపడదని సర్వేలో తేలిందని.. అక్కడ వచ్చే స్టీల్ నాణ్యమైనది కాదని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ కూడా చెప్పిందని దీంతో కేటీఆర్ వాగ్దానాలు గాల్లో కలిసిపోయంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ నేతల అలసత్వంతోనే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదని.. ఇప్పుడు ఆ పార్టీతోనే కలిసి టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శించారు.

Also read: Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు