Chandrababu : వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై గట్టిగా పోరాడాలి – చంద్రబాబు దిశానిర్దేశం

వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు చంద్రబాబు. నియోజకవర్గ సమస్యలపై స్థానిక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

Chandrababu : వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలపై గట్టిగా పోరాడాలి – చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu

Chandrababu : ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు ఇచ్చారు. దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల అక్రమాలపై గట్టిగా పోరాడాలని నేతలకు సూచించారు చంద్రబాబు. నియోజకవర్గ సమస్యలపై స్థానిక పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సమర్థ నేతలను వదులుకునేది లేదన్న చంద్రబాబు.. పని చెయ్యని వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Fish : వారానికి ఓసారి చేపలు తింటే.. పక్షవాతం ముప్పు తప్పుతుందా..?

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన డైయిరీలో లీటర్ పాలకు కేవలం రూ.18 మాత్రమే చెల్లించే పరిస్థితి ఉండేదని, టీడీపీ నిలదీయడంతో ఫిబ్రవరి నుంచి ధర పెంచి ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని తీరును ఎండగట్టడంలో పార్టీ నేతలు బాగా పని చేశారని చంద్రబాబు ప్రశంసించారు. మండల, నియోజవర్గ స్థాయిలో వైసీపీ నేతల వసూళ్లు, భూకబ్జాలపై పెద్దఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియాపై పోరాటం చేయాలన్నారు. మళ్లీ విద్యుత్ చార్జీల పెంపు, రకరకాల పన్నులతో ప్రజలను పీల్చుకు తినేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు చంద్రబాబు.

జిల్లాల పునర్విభజన విషయంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయాలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మార్చి నాటికి తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగి 40 ఏళ్లు పూర్తి అవుతుందని, ఈ సందర్భంగా ఘనంగా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు చంద్రబాబు.

Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

మహానాడుతో పాటు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రానున్న రోజుల్లో పెద్దఎత్తున కార్యక్రమాల నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ తీసుకొచ్చిన 14 పథకాలను తొలగించడమే కాకుండా వాటి పేర్లు తీసి వేసిన జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.