కరోనావైరస్‌పై శానిటైజర్ కన్నా సబ్బు బాగా పనిచేస్తుంది…ఎలాగంటే?

కరోనావైరస్‌పై శానిటైజర్ కన్నా సబ్బు బాగా పనిచేస్తుంది…ఎలాగంటే?

పూర్వీకులకు లేని సౌకర్యం.. అతి తక్కువ ఖర్చుతోనే శుభ్రంగా ఉంచగలిగే వస్తువు సబ్బు(SOAP). వందల కొద్దీ బ్యాక్టీరియాను చంపగలిగే సోప్.. కరోనాపై ఎలా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనా నుంచి దూరంగా ఉండాలంటే తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోమని WHO చెప్పగలిగిందంటే దానిపై ఎంత నమ్మకం ఉండాలి. ఎందుకంటే సబ్బులో ఉండే కెమికల్స్ నిర్మాణం నుంచే దాని పనితనం మొదలవుతుంది. 

సబ్బును తయారుచేయడానికి సూదుల్లాంటి అణువులను వాడతారు. దాంతో పాటు హైడ్రోఫిలిక్ రసాయనం మిక్స్ అయి ఉండటంతో వెంటనే నీటితో రసాయన చర్య జరిపేందుకు సిద్ధంగా ఉంటాయి. నూనె, కొవ్వులపై బాగా పనిచేస్తాయి. మనం నీటిలో సబ్బును కలిపినప్పుడు దాని అణువులు తేలుతుండటం చూస్తూనే ఉంటాం. 

ఇతర అణువులతో రసాయన చర్య జరిపినప్పుడు వచ్చే చిన్నపాటి బుడగలు అక్కడ ఉన్న మురికిని లేదా ఇన్ఫెక్షన్‌ను తీసేస్తుంటాయి. కొన్ని వైరస్‌లు రెండు పొరలతో ఉండి పైన తుడిచినా.. లేదా మరేదైనా ఘర్షణ జరిగినా రెండో లేయర్ మాత్రం అలానే ఉంటుంది. ఎక్కువ ప్రొటీన్ ఉన్న పదార్థాలు, వైరస్, బ్యాక్టీరియాలు ఇలాంటి లక్షణాలనే కలిగి ఉంటాయి. 

కరోనా వైరస్, హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ, హెర్ప్స్, ఎబోలా, జికా, డెంగ్యూలు ఇలాగే అటాక్ చేసి పేగులపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తిని తగ్గిపోయేలా చేస్తాయి. మనం సబ్బుతో చేతులు కడుక్కొన్నప్పుడు.. శరీరంపై ఉండే వైరస్‌లో భాగమైన చిన్నపాటి అణువులు నీటితో పాటు కొట్టుకుపోతాయి. 

ఈ విషయంలో శానిటైజర్లు కూడా సబ్బు చేసినంత ఎఫెక్ట్ చూపించవు. శరీరంపై ఉన్న బ్యాక్టీరియా తొలగించడంలో కేవలం 60శాతం మాత్రమే పనిచేస్తాయి. అదే స్థానంలో సబ్బు 99శాతం పనిచేస్తుందంటున్నారు నిపుణులు. న్యూమోనియా, డయేరియా, స్కిన్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ వైరస్, పోలియో వైరస్, రినో వైరసెస్, ఎడినో వైరస్ లు రాకుండా కచ్చితంగా కాపాడుతుంది సబ్బు.