విడిపోవాలని కాదు.. కలిసి ఉండాలనుకునే ప్రెసిడెంట్‌ని: జో బైడెన్

10TV Telugu News

Joe biden: అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో విజయం పొందిన జో బైడెన్ శనివారం భారీ మీటింగ్ కు హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌పై తాను సాధించిన ఉత్కంఠభరితమైన గెలుపును ప్రస్తావించారు. ‘అమెరికాను చక్కదిద్దాల్సిన సమయం ఇది. ప్రజలు విడిపోవాలని కాదు. కలిసి ఉండాలనుకునే ప్రెసిడెంట్‌నని మాటిస్తున్నా’ అని బైడెన్ చెప్పారు.

ఓటమితో అసంతృప్తికి గురవుతున్న ట్రంప్ సపోర్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘వాళ్లు కూడా అమెరికన్లే. నా శత్రువులు కాదు. అమెరికాకు పట్టిన పీడ దీంతో వదిలిపోవాలి. అమెరికాకు పునర్వైభవాన్ని తీసుకొస్తానని, జాతీయతను దేశానికి వెన్నెముకగా నిలబెడతానని మాటిస్తున్నా. మిడిల్ క్లాస్ వాళ్లతో అమెరికా మళ్లీ ప్రపంచం గౌరవించే స్థాయికి ఎదుగుతుంది’ అని బైడెన్ అన్నారు.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జో.. ఆఫ్రికన్-అమెరికన్ కమ్యూనిటీకి ట్రిబ్యూటీని తెలియజేశారు. ఛాలెంజింగ్ రోల్ తీసుకుంటున్నానని ట్రంప్ ను పాయింట్ చేస్తూ ప్రస్తావించారు.

వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కమలాహ్యారిస్ ను ప్రశంసిస్తూ.. సోషల్ డిస్టెన్స్ పాటించిన గుంపును ఉద్దేశించి ప్రసంగించారు. ‘మన జాతి మొత్తం చెప్పేసింది. స్పష్టమైన విజయం అందించారు’ అని బైడెన్ అన్నారు.

10TV Telugu News