Woman beats boss : బాస్‌ ముఖంమీద నీళ్లు కొట్టి..తుడుపు కర్రతో చితకబాదిన ఉద్యోగిని..

Woman beats boss : బాస్‌ ముఖంమీద నీళ్లు కొట్టి..తుడుపు కర్రతో చితకబాదిన ఉద్యోగిని..

China Woman Beats Boss With Mop

Woman beats boss with mop : ఉద్యోగం చేసే మహిళలు బాసులతో వేధింపులకు గురి కావటం చాలా చోట్ల జరుగుతుంటుంది. దీంతో వేధింపుల్ని మౌనంగా భరించేవారు కొందరైతే..సివంగుల్లా బాసులకు బుద్ది చెప్పేవారు ఇంకొందరుంటారు. అదిగో అటువంటి సివంగిలాంటి ఓ ఉద్యోగి బాసుకు నేల ఊడ్చే కర్రతో దులిపిపారేసింది. నువ్వు బాసువైతే నాకేంటీ?..ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..లేదండీ ఒంటిమీదున్న చెత్తే కాదు బుర్రలో ఉన్న చెత్తను కూడా ఊడ్చిపారేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో బాసుబాబుకు దిమ్మతిరిగిపోయింది. చుక్కలు కనిపించాయి…సదరు ఉద్యోగిని బాసుని నేల ఊడ్చే కర్రతో బుద్ధి చెబుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీంతో ఆమెపై మహిళలే కాదు చాలామంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వెధవకి బాగా బుద్ధి చెప్పావు..అందరూ నీలాగా ఉండాలంటూ పొగిడేస్తున్నారు. ఎందుకుంటే ఇటువంటి బాసులే కాదు చాలామంది మగ ఉద్యోగులు ఇలాగే ఉంటారు. వెధవల్లాగా.. అది ప్రభుత్వ సంస్థే కాదు ప్రైవేటు సంస్థలైనా సరే..ఇంతకీ సదరు ఉద్యోగిని బాసుని అంతగా కడిగిపారేయటానికి కారణమేంటంటే..

చైనాలోని సుయిహువా ప్రాంతానికి చెందిన జౌ (Zhou) అనే మహిళ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. బాసుని తుడుపు కర్రతో ఉతికి పారేసిన మహిళ ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న ఔ తన ఉన్నతాధికారి వాంగ్‌‌ను గదులు శుభ్రం చేసే తుడుపు కర్రతో చితకబాదిన ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో సదరు బాసు పరువు డ్రైనేజీలో కలిసింది. తిక్క తీరిందేరా? అని కొంతమంది ఇంకా కాస్త ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు. ఓ ప్రభుత్వ సంస్థలో పనిచేస్తు్న్న ఔ తన ఉన్నతాధికారి వాంగ్‌ ఆమెకు కొన్ని రోజులుల నుంచి అసభ్యకర మెసేజులు పంపుతున్నాడు. దీంతో ఔకు మండిపోయింది. బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్‌తో కలిసి ఆఫీసుకు వెళ్లింది. అంతే అక్కడ గదులను శుభ్రం చేసే తుడుపు కర్రను తీసుకుని బాస్ రూమ్ లోకి చితకబాదింది. ఇదంతా ఆమె ఫ్రెండ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.బాబూ పరువు గంగలో కలిసింది.

ఈ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌గా మారింది. చెత్త పనులు చేసే బాసులకు ఇలాగే సమాధానం ఇవ్వాలంటూ నెటిజనులు ఆ మహిళా ఉద్యోగిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 14 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ఆమె తన బాసును తుడుపు కర్రతో కొట్టడమే కాదు.. పుస్తకాలను అతని మీదకు విసిరింది. ముఖం మీద నీళ్లు పోసింది.

దీనిపై సదరు బాసు వాంగ్ ఏం చేయాలో తెలిక తన వెర్రి వేషాలను కప్పి పుచ్చటానికి నానా తంటాలు పడ్డాడు. ‘ఆ మెసేజ్‌ నేను ఆమెకు ఏదో సరదాగా జోక్‌గా పంపానని చెప్పుకొస్తున్నాడు. ఆ వీడియో తీస్తున్న జౌ స్నేహితురాలు ‘‘అది జోక్ ఎలా అవుతుంది? నీది ఎంత తప్పుడు క్యారెక్టరో ఆ మెసేజే చెబుతోంది’’ అంటూ నోరు మూయించేసింది. ఈ ఘటనపై సుయిహువా పోలీసులు స్పందించారు. తమ బాస్ తనని లైంగికంగా వేదిస్తున్నాడంటూ ఆ మహిళ నాలుగు రోజుల కిందట ఫిర్యాదు చేసిందని..ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉందని తెలిపారు.