viral : భార్య పెట్టిన లంచ్ బాక్సుని ఆఫీసులో అమ్మేస్తున్న భర్త..

ఆఫీసుకు వెళ్లే భర్త కోసం ఎంతో ప్రేమగా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తోంది భార్య. కానీ భార్య ఎంతో ప్రేమగా వండి లంచ్ పెడుతుంటే దాన్ని భర్త ఆఫీసులో అమ్మేస్తున్నాడు.

viral : భార్య పెట్టిన లంచ్ బాక్సుని ఆఫీసులో అమ్మేస్తున్న భర్త..

Husband Selling Lunch Made By Wife

husband Selling Lunch Made By Wife : ఆఫీసుకు వెళ్లే భర్త కోసం ఎంతో ప్రేమగా లంచ్ బాక్స్ రెడీ చేసి ఇస్తోంది భార్య. సాయంత్రం ఆఫీసు నుంచి భర్త ఇంటికి రాగానే లంచ్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉండటం చూసిన ఆ భార్య ‘హమ్మయ్య పూర్తిగా తిన్నారు’ లంచ్ అంత బాగా నచ్చిందేమో అనుకుని సంతోషపడేది. అలా ప్రతీ రోజు ఎంతో ప్రేమగా వండి లంచ్ బాక్స్ పెట్టేది.

కానీ పాపం ఆ వెర్రి భార్యకు తెలీదు తను ఎంతో ప్రేమగా వండి లంచ్ పెడుతుంటే దాన్ని భర్త ఆఫీసులో అమ్మేస్తున్నాడని..కానీ నిజం బైటపడింది. ఆ భార్య భద్రకాళి అయ్యింది. ‘‘ఇకనుంచి నీకు లంచ్ కాదు కదా..సింగిల్ టీ కూడా పెట్టి ఇవ్వను..ఏంచేసుకుంటావో చేస్కో ఫో’’ అంటూ తిట్టిపారేసింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు..అవును మరి భర్త కోసం అంత ప్రేమగా వండిపెడుతుంటే దాన్ని అమ్ముకోవటమేంటీ? ఆమె చేసింది కరెక్టేనంటున్నారు.

బైట ఫుడ్ లు కంటే అందరూ హోమ్ ఫుడ్ నే ఇష్టపడతారు చాలామంది. బయట అయితే రకరకాల ఫుడ్ తింటే హెల్త్ పాడువుతుందని ఆలోచిస్తారు. భార్య చక్కగా వండిపెడితే చాలురా బాబూ అనుకుంటారు. కానీ భార్య ప్రేమతో లంచ్ చేసి ఇస్తుంటే దాన్ని పట్టుకెళ్లి ఆఫీసులో అమ్ముకుంటున్న భర్త నిర్వాకాన్ని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తంచేయటంతో అదికాస్త వైరల్ గా మారింది.

వైఫ్ అండ్ హస్బెండ్ డబ్బులు పొదుపుగా వాడుకుని కొత్త అపార్ట్‌మెంట్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. దానికోసం ఇంట్లో అనవసరమై ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ పాపం చాలామందిలాగే ఆ భర్తకి ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. ఎంత ఇష్టమంటే..ఫాస్ట్ ఫుడ్ కోసం రోజుకు సుమారు 20 డాలర్లు ఖర్చు చేసేంత. ఆ ఖర్చుని తగ్గించటానికి ఆ భార్య ఓ ప్లాన్ వేసింది. ఇంటినుంచి లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తే ఫాస్ట్ ఫుడ్ తినడు కదా. డబ్బు ఆదా అవుతుంది? భర్త ఆరోగ్యానికి మంచిదని అనుకుంది. అనుకున్నట్లుగానే ప్రతీరోజు భర్తకు లంచ్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి పంపించేది. ఆమె లంచ్ బాక్స్‌లో పెట్టిన శాండ్‌విచ్‌లను భర్త తినకుండా.. ఆఫీస్‌లో కొలీగ్స్ కు అమ్మకానికి పెట్టేవాడు. ఆ లంచ్ అమ్మగా వచ్చిన డబ్బులతో తనకిస్టమైన ఫాస్ట్‌ఫుడ్ తెప్పించుకుని చక్కగా లాగేంచేవాడు. ఈ విషయం తెలియని ఆ భార్య హమ్మయ్య ఫాస్ట్ పుడ్ తినటం మానేసాడు అని మురిసిపోయేది. కానీ అదంతా నిజంగాకాదని ఆమెకు తెలియదు. కానీ ఓ రోజు తెలిసింది. ఎలాగంటే..

ఓ రోజు భర్త తన కొలీగ్ ను తన ఇంటికి డిన్నర్‌కి పిలిచాడు. భర్త కొలీగ్ కోసం ఆమె రకరకాల వంటలు చేసి పెట్టింది. అవన్నీ అతనికి బాగా నచ్చాయి. ‘‘మీరు చేసే శాండ్‌విచ్‌లు చాలా బాగుంటాయ్.. కానీ కాస్త రేటు ఎక్కువే గానీ చాలా బాగుంటాయి అంటూ..పొరపాటున నోరు జారీ ఆపై అంతలోనే నాలుక కరుచుకున్నాడు. దీంతో ఆమెకు డౌట్ వచ్చేసింది. అసలు విషయం తెలిసిపోయి.. అంతే భత్రకాళికగా మారిపోయింది. తను ప్రేమతో చేసిన లంచ్ ఆఫీస్‌లో అమ్మేస్తున్నాడని తెలిసి భార్య బాగా హర్టయ్యింది. జీవితంలో లంచ్ తయారుచేయనని లంచే కాదు సింగిల్ టీ కూడా పెట్టి ఇవ్వనని తెగేసి చెప్పేసింది. ఆ తరువాత తన బాధనంతా సోషల్ మీడియావేదికగా షేర్ చేసింది. రెడిట్‌లో యు డానీ పేరుతో పెట్టిన ఈ పోస్ట్ తెగ సర్కులేట్ అవుతుంది.