Fried Towel : ఫ్రైడ్ చికెన్ ఆర్డర్, తెరిచి చూస్తే షాక్

ఫుడ్ డెలివరీ పోర్టల్ నుంచి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ రెస్టారెంట్ నుంచి ఇంటికి పార్సిల్ వచ్చింది. ఈ చికెన్ ను కొడుకుకు తినిపిద్దామని కవర్ ఓపెన్ చేసింది. ఓ పీస్ కట్ చేద్దామని అనుకుంది. ఎంతకీ కట్ కాలేదు.

Fried Towel : ఫ్రైడ్ చికెన్ ఆర్డర్, తెరిచి చూస్తే షాక్

Chicken Order

Fried Towel Chicken Order : కొన్ని ఆన్ లైన్ ఆర్డర్స్ చికాకు తెప్పిస్తున్నాయి. ఒకటి ఆర్డర్ చేస్తే..మరొకటి రావడం కామన్ అయిపోయింది. దీంతో పలువురు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కరోనా కాలంలో ఆన్ లైన్ ఆర్డర్స్‌‌కు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఆన్ లైన్ లో ఓ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేస్తే..ఫ్రై చేసిన టవల్ వచ్చింది. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.

అలిక్ పెరెజ్ మహిళ..ఫుడ్ డెలివరీ పోర్టల్ నుంచి ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ రెస్టారెంట్ నుంచి ఇంటికి పార్సిల్ వచ్చింది. ఈ చికెన్ ను కొడుకుకు తినిపిద్దామని కవర్ ఓపెన్ చేసింది. ఓ పీస్ కట్ చేద్దామని అనుకుంది. ఎంతకీ కట్ కాలేదు. దీంతో తన భర్తను పిలిచింది. అతను కవర్ మొత్తం ఓపెన్ చేస్తే ఫ్రై చేసిన టవల్ కనిపించింది. దీనిని చూసిన పెరెజ్ కోపం కట్టలు తెంచుకుంది. జొల్లిబీ రెస్టారెంట్ చేసిన పనిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది. దీనిపై సదరు రెస్టారెంట్ స్పందించింది. జరిగిన తప్పిదంపై విచారం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేయడం జరుగుతుందని వెల్లడించింది.

Read More : MS Dhoni : బుడ్డోడి హెలికాప్టర్ షాట్, నెటిజన్లు ఫిదా