Viral Pic : జీన్స్ ప్యాంట్ వేసుకున్న గుర్రం..

జీన్స్ ప్యాంటు వేసుకున్న గుర్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్యాంట్ వేసుకున్న గుర్రాన్ని చూస్తే నీ జీను ప్యాంటు చూసి గుర్రమో..అనే పాట పాడాలనిపిస్తోందట జనాలకు..

Viral Pic : జీన్స్ ప్యాంట్  వేసుకున్న గుర్రం..

Hourse Pant

Horse wearing jeans pants : ఓ గుర్రం జీన్స్ ప్యాంట్ వేసుకుంది.అదేంటీ ప్యాంట్ అంటే రెండు కాళ్లే ఉంటాయి కదా..మరి నాలుగు కాళ్లుంటే గుర్రం ప్యాంటు ఎలా వేసుకంటుంది? అని..ఇదంతా పక్కన పెడితే అసలు గుర్రం ప్యాంట్ వేసుకోవటమేంటీ? ఎందుకు వేసుకుంది? ఎలా వేసుకుంది? ఎవరు వేశారు? అనేది ముఖ్యం. అసలు విషయం ఏమిటంటే..పాపం గుర్రం కాలికి గాయం అయ్యింది. దాంతో ఆ గుర్రాన్ని పెంచుకునే మహిళ దానికి ప్యాంట్ వేసింది. ఇలా జీన్స్ ప్యాంటు వేసుకున్న గుర్రం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అమెరికాలో ఉంటున్న ఓ మహిళ తమ ఇంట్లో పెంచుకుంటున్న గుర్రం కాలికి గాయం అయ్యింది. ఆ గాయం కనిపించకుండా ఉండటానికి ఆమె ఆ గుర్రానికి డెనిమ్ జీన్స్ ప్యాంట్ వేసింది. అలా జీన్స్ ప్యాంట్ వేసిన గుర్రం ఫోటోలను ఆమె భర్త బెన్ వాయ్టాస్ జులై 18న తన ట్విట్లర్ లో పోస్ట్ చేసి, ‘నా భార్య గుర్రాన్ని అందంగా తయారుచేసింది. దానికి తగిలిన గాయం కనపడకుండా ఇలా చేసింది’ అని హ్యాష్ ట్యాగ్ జతచేశాడు.

ఇక అప్పటినుంచి మొదలైంది జీన్స్ ప్యాంట్ వేసుకున్న గుర్రం ఫోటోలు వైరల్ కావటం. ఈ ఫోటోను దాదాపు 66,000 మంది లైక్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. గుర్రాలు కూడా జీన్స్ ధరించడం ఆశ్యర్యంగా ఉంది. కానీ గుర్రం చాలా ప్యాషన్‌గా కనిపిస్తుందని ట్వీట్ చేశాడు. ప్యాంట్ వేసుకున్న గుర్రాన్ని చూస్తే నీ జీను ప్యాంటు చూసి గుర్రమో..అనే పాట పాడాలనిపిస్తోందట జనాలకు..