Rude Toilet Habits : బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు ఉంటున్నాడని భర్తని వదిలేసింది

తన భర్త తాగుబోతు అనో, తిరుగుబోతో అనో, సోమరిపోతో అనో బాధపడే భార్యల గురించి విన్నాము, చూశాము. కానీ ఆమె భర్త మాత్రం అదో టైపు. ఆమెకి విచిత్రమైన సమస్య ఎదురైంది. అదేంటంటే...

Rude Toilet Habits : బాత్‌రూమ్‌లో ఎక్కువసేపు ఉంటున్నాడని భర్తని వదిలేసింది

Rude Toilet Habits

Rude Toilet Habits : తన భర్త తాగుబోతు అనో, తిరుగుబోతో అనో, సోమరిపోతో అనో బాధపడే భార్యల గురించి విన్నాము, చూశాము. కానీ ఆమె భర్త మాత్రం అదో టైపు. ఆమెకి విచిత్రమైన సమస్య ఎదురైంది. అదేంటంటే… భర్త టాయ్ లెట్ అలవాటు. అవును.. తన భర్త టాయ్ లెట్ అలవాటు ఆమెని చికాకు పెడుతోంది. భర్త తీరుతో ఆమె విసిగిపోయింది. భర్తకున్న అలవాటు భరించలేక ఒకానొక సమయంలో అతడిని వదిలేసి వెళ్లిపోయింది. పదే పదే బాత్ రూమ్ కి వెళ్తాడు. గంటల కొద్దీ బాత్ రూమ్ లో గడుపుతాడు. ఇదే అతడికున్న మహా చెడ్డ అలవాటు.

”నా భర్త జస్టిన్ ఎక్కువసేపు బాత్ రూమ్ లో సమయం వెచ్చిస్తాడు. కొత్త ఇంటికి మారినప్పటి నుంచి ఇంతే. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఒకసారి ఇద్దరమూ రెస్టారెంట్ కి వెళ్లాము. లంచ్ చేస్తున్నాము. సరిగా అదే సమయంలో మా ఆయన బాత్ రూమ్ కి వెళ్లాలని లేచాడు. వెంటనే ఆయనకు గుర్తు చేశాను. మనం ఉన్నది ఇంట్లో కాదు రెస్టారెంట్ లో అని. ఎక్కువసేపు టాయ్ లెట్ లో ఉండకుండా త్వరగా వచ్చేయండి అని చెప్పా. ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్లాడు.

”పది నిమిషాలు గడిచాయి. ఆ తర్వాత మరో 8 నిమిషాలు గడిచాయి. నా భర్తకి ఫోన్ చేశాను. మేసేజ్ కూడా చేశాను. మనం రెస్టారెంట్ లో ఉన్నాము. టేబుల్ మీద ఫుడ్ ఉందని గుర్తు చేశాను. అంతేకాదు చివరికి జెంట్స్ బాత్ రూమ్ కి వెళ్లి డోర్ మీద కొట్టాను. కొన్ని సెకన్లలో బయటకు వస్తాను అని చెప్పాడు. అయినా బయటకు రాలేదు. దాంతో నేను టేబుల్ దగ్గరికి వచ్చేశాను. ఒంటరిగానే మీల్స్ పూర్తి చేశాను. నా లంచ్ అయ్యాక మరోసారి భర్తకు కాల్ చేశాను. అయినా ఆయన బయటకు రాలేదు. నాకు బాగా చిరాకేసింది. వెంటనే వెయిటర్ ని పిలిచి సెపరేట్ గా బిల్లు ఇవ్వాలని చెప్పాను. ఆ బిల్లు చెల్లించి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేశాను. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిపోయాను. నేను ఇంటికి చేరుకున్న 20 నిమిషాలకు భర్త ఇంటికి వచ్చాడు” అని ఆమె తెలిపింది.

నా భర్త తప్పు చేయడమే కాకుండా నాపై కేకలు వేయడం నన్ను బాధించింది అని భార్య వాపోయింది. నువ్వు స్వార్థపరురాలివి అని నన్ను తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. మీల్స్ రావడానికి లేటు అవుతుందని అనుకున్నా అందుకే రెస్ట్ రూమ్ కి వెళ్లానని చెప్పాడు. మరికాసేపు వేచి ఉండాల్సింది అన్నాడు. ఇలా తన భర్త ఎక్కువ సేపు బాత్ రూమ్ లో ఉంటున్నాడని ఆమె తెగ బాధపడిపోతోంది. జీవితంలో మరెప్పుడూ నీతో బయటకు రాను అని ఆమె భర్తకు తెగేసి చెప్పింది.

దీనిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఇలాంటి కష్టం ఏ భార్యకు రాకూడదని ఒకరు కామెంట్ చేశారు. ఇంతకీ అతడికి బాత్ రూమ్ లో అంతసేపు ఏం పని? వీడియో గేమ్స్ కి లేదా ఫోన్ కి బానిస అయ్యి ఉంటాడని ఒకరు, ఫోన్ లో పోర్న్ చూడటం అలవాటుగా మారిందని మరొకరు కామెంట్ చేశారు. మరో మహిళతో సంబంధం ఉండొచ్చని అందుకే అతడు ఇలా చేస్తున్నాడని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేశాడు. బాత్ రూమ్ కి వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా చూడాలని మరొకరు సలహా ఇచ్చారు. అప్పుడు కూడా బాత్ రూమ్ లో ఎక్కువసేపు ఉంటున్నాడు అంటే కచ్చితంగా ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.