Mom Doctor: తల్లిని ట్రీట్ చేసిన డాక్టర్‌పై కేసు.. రూ.కోట్లు గెలుచుకున్న మహిళ

యూకేలో ఎవీ టూంబెస్ అనే యువతి తనకు వచ్చిన కష్టానికి బాధ్యత డాక్టర్‌దేనంటూ కంప్లైంట్ చేసి రూ.కోట్లు గెలుచుకుంది. Spina bifida అనే సమస్యతో పుట్టిన మహిళ జీవితాంతం ట్యూబ్స్ సాయంతోనే..

Mom Doctor: తల్లిని ట్రీట్ చేసిన డాక్టర్‌పై కేసు.. రూ.కోట్లు గెలుచుకున్న మహిళ

Evie Toombeds

Updated On : December 3, 2021 / 10:45 AM IST

Mom Doctor: యూకేలో ఎవీ టూంబెస్ అనే యువతి తనకు వచ్చిన కష్టానికి బాధ్యత డాక్టర్‌దేనంటూ కంప్లైంట్ చేసి రూ.కోట్లు గెలుచుకుంది. Spina bifida అనే సమస్యతో పుట్టిన మహిళ జీవితాంతం ట్యూబ్స్ సాయంతోనే బతకాలి. ఒక్కో సందర్భంలో 24గంటలు ఆ ట్యూబ్స్ తోనే గడపాల్సి వస్తుందని చెప్పింది.

ఈ సమస్యపై కోర్టుకెక్కిన ఆమె.. డా.ఫిలిప్ మిచెల్ పై కంప్లైంట్ చేసింది. తన తల్లి ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో డాక్టర్ సరైన సలహా ఇవ్వకపోవడమే దీనికి కారణమని అందులో పేర్కొంది. గర్భిణీగా ఉన్నప్పుడు spina bifida నుంచి బయటపడటానికి ఫోలిక్ యాసిడ్ లాంటి సప్లిమెంట్స్ వాడాలని సూచించాడు.

దానికంటే గర్భస్రావం చేసుకోమని చెప్పి ఉంటే ఇటువంటి సమస్యలతో ఎవీ పుట్టుండేది కాదని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై జడ్జి రొసాలింద్ కోయ్ క్యూసీ లండన్ హైకోర్టులో బుధవారం తీర్పునిచ్చారు. ఎవీ తల్లికి సరైన సలహా ఇచ్చి ఉంటే, కాస్త ఆలస్యంగా గర్భం దాల్చి ఉండేదని… ఇటువంటి కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని అన్నారు.

………………………………………. : ఏపీలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్ళు

సాధారణ పరిస్థితుల్లో గర్భం దాల్చేదని.. చెప్పడంతో పాటు ఎవీ టూంబెస్ జీవిత కాల ఖర్చులు డాక్టర్‌యే భరించాలని తీర్పనిచ్చారు.